బిసి ఉద్యోగుల సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులుగా దుబ్బాక వీర కుమార్

హైదరాబాద్ ఆగష్టు 29 ();నిజామాబాద్ జిల్లా బిసి ఉద్యోగుల సంఘం అధ్యక్షులుగా దుబ్బాక వీర కుమార్ నియమితులైనారు. ఈ మేరకు బిసి సంక్షేమ సంఘంజాతీయ అద్యక్షులు ఆర్. కృష్ణయ్య నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ బిసి ల సహక్కుల సాదన కోసం జరిగే పోరాటం లో ఉద్యోగుల పాత్ర కీలక మన్నారు.పార్లమెంట్ లో బిసి బిల్లు పెట్టాలని, ఏణ్డ్ఱా లో బిసి లకు ప్రత్యెక మంత్రిత్వ శాఖ ను ఏర్పాటు చేయాలని, బిసి ఉద్యోగుల కు ప్రమోషన్లలో రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేసారు.అనంతరం దుబ్బాక వీర కుమార్ మాట్లాడుతూ బిసి ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం తనవంతు కృషి చేస్తానన్నారు. నిజామాబాద్ జిల్లా లో బిసి ఉద్యోగుల ను సంఘటితం చేసి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. తనకు ఈ పదవికి రావడానికి సహకరించిన బిసి సంక్షేమ సంఘం తెలంగాణా రాష్ట్ర అద్యక్షులు ఎర్ర సత్యనారాయణకు కృతఙ్ఞతలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking