లక్షెట్టిపేట ఎంపీపీ అన్నం మంగ చిన్నయ్య
ఘనంగా మాజీ స్పీకర్ జయంతి
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 02 : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్ధిల్ల శ్రీపాద రావు చేసిన సేవలు మరువలేనివని లక్షెట్టిపేట ఎంపీపీ అన్నం మంగ చిన్నయ్య పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో స్వర్గీయ దుద్దిల్ల శ్రీపాదరావు 89 వ జయంతిని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ…మాజీ స్పీకర్ శ్రీపాద రావు ఎన్నో మంచి పనులు చేశారని,అందుకే అయన నేటికీ ప్రజల గుండెల్లో నిలిచిన నాయకుడు అన్నారు. నిత్యం పేద ప్రజలకు సేవ చేయడం ద్వారా తన పేరు చిరస్తాయిగా నిలిచి పోయిందన్నారు.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ దేవేందర్ రెడ్డి,ఎంపీడీవో సరోజ,ఎంపీవో విజయ్ ప్రసాద్,కార్యాలయ పర్యవేక్షకులు దేవేందర్ రావ్ ఎంపీటీసీ కల్లు దావీదు,కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.