బస్సు టైమింగ్స్ మారడం వలన తీవ్ర ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు నిరుద్యోగులు కూలీలు

 

ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి 10 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా బోనకల్ మండల ప్రజలను ఇబ్బంది పెడుతున్న ఆర్టీసీ యంత్రాంగం బోనకల్ మండలం నుండి ఖమ్మం వెళ్ళుటకు డైలీ ఉదయం 8 గంటలకు బస్సు బోనకల్ టూ ఖమ్మం ప్రయాణికులు చేరవేస్తున్నది అటువంటి బస్సు టైమింగ్స్ మార్చడం వలన కాలేజీ డ్యూటీ వివిధ కారణాల వల్ల ఖమ్మం వెళ్లవలసిన ప్రజలు విద్యార్థులు సామాన్య ప్రజలు చాలా మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు బస్సు పాస్ ఉండి కూడా ఉపయోగం లేని పరిస్థితి
డైలీ బోనకల్ నుండీ ఖమ్మం వచ్చే అన్ని బస్సులు పాత బస్టాండ్ కి వెళ్తున్నాయి విద్యార్థిని విద్యార్థులు మరియు నిరుద్యోగ ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ యాజమాన్యం బస్ టైమింగ్స్ మార్చగలరని ప్రజలు కోరుచున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking