ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి 10 (ప్రజాబలం) ఖమ్మం నగరంలో సుగ్గుల వారి తోట ప్రాంతంలో నివాసముంటున్న పుట్టా సైదులు వయసు (45) వృత్తి పెయింటింగ్ పని రోజువారి కూలి చేసుకుంటూ జీవితం గడుపుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ అయి కాలు విరగడం జరిగింది నా అనేవాళ్లు ఎవరూ లేక బాధపడుతూ వైద్యం చేయించుకోవడానికి ఆర్థిక స్తోమత సరిపోక వెంటనే పల్లా కిరణ్ కుమార్ ను ఆశ్రయించగా* తక్షణమే స్పందించి హాస్పిటల్ చికిత్సకు మరియు మందులకు సహాయం చేయడం జరిగింది. రెండు నెలల వరకు బెడ్ రెస్ట్ తీసుకోవాలని డాక్టర్ చెప్పాగా రెండు నెలల వరకు సరిపోయే బియ్యం పప్పు మొదలగు కిరాణా సర్కులు మరియు కూరగాయలను అందించి సహాయపడ్డారు సహృదయంతో తనను ఆదుకుని సహాయం చేసినందుకు పుట్టా సైదులు పల్లా కిరణ్ కుమార్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ రుణపడి ఉంటాను అన్నారు .