సెల్లార్ లో గదులు నిర్మించి అద్దెకు ఇవ్వడం వల్ల ట్రాఫిక్ సమస్య తలెత్తుతోందని మున్సిపల్ 92 మంది నోటీసులు
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూలై 29 : ఢిల్లీ లోని ఓ కాంప్లెక్స్ సెల్లార్ లో వరద నీరు చేరి ముగ్గురు మృతి చెందిన ఘటనపై మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ తీవ్రంగా స్పందిస్తూ మంచిర్యాల లో సెల్లార్ లలో నిర్మించిన కట్టడాలను వెంటనే ఖాళీ చేయాలని వ్యాపారస్తులకు సూచించారని కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది.ఈ మేరకు సోమవారం నస్పూర్ మున్సిపల్ చైర్మన్ వేణు, మంచిర్యాల మున్సిపల్ వైస్ ఛైర్మన్ సల్ల మహేష్,కౌన్సిలర్ వేములపల్లి సంజీవ్ మీడియా సమావేశంలో మాట్లాడారు.మంచిర్యాల,నస్పూర్ మున్సిపల్ పరిధిలో నిర్మించిన వ్యాపార సముదాయాలలోని సెల్లార్ లో గదులు నిర్మించి అద్దెకు ఇవ్వడం వల్ల ట్రాఫిక్ సమస్య తలెత్తుతోందని వారన్నారు. వ్యాపారస్తులు, అందులో పని చేసే గుమాస్తాలు రోడ్డుపై వాహనాలు నిలపడంతో కొనుగోలుదారుల వాహనాలకు పార్కింగ్ కు లేక రోడ్డుపై పార్కింగ్ చేయడంతో ట్రాఫిక్ సమస్య జఠిలంగా మారిందని వారు తెలిపారు. సెల్లార్ లు స్వచ్చందంగా ఖాళీ చేసి పార్కింగ్ కు అనువుగా వినియోగంలోకి తీసుకురావాలని మున్సిపల్ అధికారులు ఇప్పటికే 92 మందికి నోటీసులు జారీ చేసినట్లు వారు చెప్పారు.కాబట్టి వ్యాపారస్తులు పట్టణ సుందరీకరణకు, ట్రాఫిక్ సమస్య నివారణకు సహకరించాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మండల నాయకులు పట్టణ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.