ఢిల్లీ ఘటనపై డీసీసీ అధ్యక్షరాలు సురేఖ
మృతులకు నివాళులు
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూలై 29 : దేశ సేవలో భాగస్వాములు కావడానికి సివిల్స్ కు సిద్ధమవుతున్న ముగ్గురు వరదనీటిలో దుర్మరణం చెందడం విచారకరమని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు అన్నారు. ఢిల్లీలో వరద నీటిలో మునిగి ప్రాణాలు విడిచిన తాన్యా సోని, నవీన్,శ్రేయా యాదవ్ ల చిత్రపటాలకు సురేఖతో పాటు కాంగ్రెస్ శ్రేణులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సురేఖ మృతుల్లో శ్రీరాంపూర్ లో సింగరేణి అధికారి విజయ్ కుమార్ కూతురు సోని ఉండడం కలచివేసిందని అన్నారు.ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న ముగ్గురు మరణించడం దేశానికి వారి కుటుంబాలకు తీరని వేదనను మిగిల్చిందని తెలిపారు.సెల్లార్ లో లైబ్రరీ నిర్మించడం వల్లనే వరద పోటుకు ప్రాణాలు పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.