తొమ్మిదిన్నర బీఆర్ఎస్ పాలనలో అంతా అక్రమాలే

టిడిపి నియోజకవర్గ ఇంచార్జ్ మహంకాళి రాజన్న

జగిత్యాల ప్రతినిధి, ఏప్రిల్ 28:(ప్రజా బలం) బీఆర్ ఎస్ తొమ్మిదిన్నర ఏండ్ల పాలనలో అంతా అవినీటిమయమని, దళితబందు పతకంలో జరిగిన అవినీతిని సీఎం ప్రకటించడంతో వాస్తవం వెలుగులోకి వచ్చిందని టిడిపి జగిత్యాల నియోజకవర్గ ఇంచార్జ్ మహంకాళి రాజన్న అన్నారు. శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఇందుకాదు అందు కాదు అన్న రీతిలో తెలంగాణ ప్రభుత్వం లో అవినీతి పెరిగిపోయిందన్నారు. కాళేశ్వరం మొదలుకొని మిషన్ భగీరథ, యాదాద్రి పనులు, కరెంట్ ఇలా అన్నింటా బీఆర్ ఎస్ ఎమ్మెల్యేల అవినీతి పెరిగిందన్నారు. చివరకు దళిత బంధు పతకంలో అవినీతి జరిగిందని వారందరి చిట్టా తనదగ్గర ఉందని ముఖ్యమంత్రి ప్రకటించడంతోనే నిజాలు బయటపడ్డాయన్నరు. రాష్ట్రంలో ఇండ్లు లెనోళ్ళకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తామంటిరి మరో ఆరునెలల గడువుండని ఈ టైంలో ఏమిచేస్తారో చెప్పాలని రాజన్న ప్రశ్నించారు. ఉద్యోగుల జీతభత్యాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని రాజన్న డిమాండ్ చేశారు. రానున్న ఎన్నికల్లో మీ పార్టీకి 15 నుంచి 20 సీట్లకు పరిమితము అవుతారని ప్రజలు మీమ్మల్ని సాగనంపే రోజులు వచ్చాయని మహంకాళి రాజన్న అన్నారు. ఆయన వెంట బత్తుల కొండయ్య, కొండ శ్రీధర్, భార్గవ్ రామ్, విజయ్ కుమార్, గంగారెడ్డి, అఖిల్, కోయ బాలకృష్ణ, కాశీనాతమ్, మగ్గిడి గంగాధర్, నక్క లక్ష్మణ్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking