బహుజన పార్టీ ఆధ్వర్యంలో ఖమ్మం కార్మిక విభాగం సన్నాహక సమావేశం

 

 

ఖమ్మం ప్రతినిధి ఏప్రిల్ 28 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా లొ బహుజన సమాజ్ పార్టీ అధ్వర్యంలో కార్మిక విభాగం సన్నాహక సమావేశం జరిగింది ఈ సమావేశానికి హాజరైన రాష్ట్ర కార్యదర్శి ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంఛార్జి మరియు బహుజన సమాజ్ పార్టీ ఖమ్మం జిల్లా ముఖ్య సలహాదారు మట్టే గురుమూర్తి హాజరు అయినారు ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ఖమ్మం జిల్లా లో గల సంగటిత అసంగటిత కార్మికులను ఏకం చేసి బహుజన కార్మికుల కోసం పనిచేయాలి అని అందులో భాగంగా ఈ రోజు జరిగిన సమా వేశంలో తెలంగాణ రాష్ట్రం లో బహుజన సమాజ్ పార్టీ అధ్వర్యంలో డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ నాయకత్వం లో బహుజనుల ముద్దు బిడ్డ బావి భారత ప్రధాని బహుజనుల మార్గ దర్శి ఈ దేశంలో బహుజన రాజ్యాధికారం సాధించాలి అని నిరంతరము కృషీ చేస్తున్న బెహాన్ కుమారి మాయావతి మే 7 వ తేదీన జరిగే ముఖ్య అతిథిగా వస్తున్నారు ఈ సభకు బహుజనులు కార్మికులు ఉద్యోగులు విద్యార్థులు మహిళలు లక్ష లదిగా తరలి రావాలని కోరారు ముఖ్యంగా ఖమ్మం లో మున్సిపల్ కార్మికులు హాస్పిటల్ సిబ్బంది ఆటో డ్రైవర్లు కండక్టర్లు డ్రైవర్లు గ్రానైట్ కార్మికులు ఉద్యోగులు సుతారి కార్మికులు టైలారింగ్ కార్మికులు విద్యుత్ కార్మికులు ప్రవేట్ ఉద్యోగులు ఐకేపీ సిబ్బంది వాలంటరీ రిటైర్ కార్మికులు సింగరేణి కార్మికులు సమస్త సబ్బండ వర్ణాల బహుజన కార్మికులు పెయింటర్ కార్మికులు ప్లంబర్ కార్మికులు సమస్త వృతి కార్మికులు ఏకం కావాలి అని మట్టే గురుమూర్తి పిలుపు నిచారు ఖమ్మం లో త్వరలోనే కార్యాలయం ప్రారంభిస్తాం అని తెలిపారు మరియు బహుజన కార్మిక సంఘం రిజిస్టర్ అయిన సంఘం అని తెలుసుకోవాలి మరియు కార్మిక హక్కుల కోసం నిరంతరం పనిచేసి బహుజన సమాజ్ పార్టీ ని అధికారం లో కి తీసుకు రావటం మన అందరి లక్ష్యం కాబట్టి బహుజన కార్మికులు జిల్లా నియోజక వర్గ స్థాయి మండల స్థాయి సమావేశం అనంతరం జిల్లా నియోజకవర్గ మండల కమిటీని వెంటనే ప్రకటిస్తాం అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం నియోజవర్గ ఇంచార్జ్ అయిత గాని శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking