వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి

రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానీయా

ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి 6 (ప్రజాబలం) ఖమ్మం వేసవిలో త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానీయా అన్నారు. మంగళవారం కూసుమంచి మండలం జీళ్ళచేరువు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ వద్ద జిల్లా కలెక్టర్ వి పి. గౌతమ్ మిషన్ భగీరథ ఇఎన్సి జి. కృపాకర్ రెడ్డి లతో కలిసి ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల మిషన్ భగీరథ అధికారులతో త్రాగునీటి సరఫరాపై సమీక్ష నిర్వహించారు. జిల్లాల వారిగా కుటుంబాలు, జనాభా, నల్లా కనెక్షన్లు, గ్రిడ్ నుండి నీటి సరఫరా, రోజువారి నీటి డిమాండ్ తదితర అంశాసలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాబోయే మూడు నెలలు చాలా కీలకమని, నీటి సరఫరాలో లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకొని, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అన్నారు. ఖమ్మం జిల్లాలో 957 గ్రామీణ ఆవాసాలకు గాను 283368 ఇండ్లకు, నల్లా కనెక్షన్లు ఉన్నట్లు, సూర్యాపేట జిల్లాలో 817 గ్రామీణ ఆవాసాలకు గాను 241129 ఇండ్లకు నల్లా కనెక్షన్లు, మహబూబాబాద్ జిల్లాలో 1350 గ్రామీణ ఆవాసాలకు గాను 179517 నల్లా కనెక్షన్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1516 గ్రామీణ ఆవాసాలకు గాను 239997 నల్లా కనెక్షన్లు ఉన్నట్లు ఆయన తెలిపారు. ఆయన అన్నారు. జల్ జీవన్ మిషన్ కు సంబంధించి నిధులు వస్తాయని, ఎక్కడైనా త్రాగునీటి సంబంధ పనులు ఉంటే పూర్తిచేయాలని అన్నారు. గత అనుభవాల దృష్ట్యా ఏ ఏ గ్రామాల్లో త్రాగునీటి ఇబ్బందులు వస్తాయో, అట్టి గ్రామాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ మూడు నెలలు నిధులు త్రాగునీటికే వినియోగించాలని ఆయన తెలిపారు. ప్రభుత్వం నియోజకవర్గానికి 10 కోట్ల చొప్పున ప్రత్యేక నిధులు కేటాయించినట్లు, అట్టి నిధులతో 10 శాతం త్రాగునీటి కోసం వెచ్చించాలన్నారు. అధికారులు అందుబాటులో ఉండాలని, సమస్యలు వస్తే వెంటనే పరిష్కరించాలనిఆయన అన్నారు. మండలానికి ఒక ఏఇ ఉండాలని, సమస్యాత్మక మండలాల్లో అవసరమైతే ఇద్దరిని నియమించాలని ఆయన తెలిపారు. జనాభా ను బట్టి, ఎంత మేర నీటి సరఫరా జరుగుతుంది, సరఫరా అయిన నీరు అన్ని ప్రాంతాలకు అందుతుందా అందని ప్రాంతాలకు త్రాగునీటి సరఫరాకై ఏ చర్యలు తీసుకోవాలి కార్యాచరణ చేయాలన్నారు ఖమ్మం జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మాట్లాడుతూ, మిషన్ భగీరథ ఏఇ వారి వారి కార్యస్థానాల్లో అందుబాటులో ఉండాలన్నారు. మిషన్ భగీరథ నుండి నీటి సరఫరా లేని ప్రాంతాలకు స్థానిక వనరులు, బావులు, బోర్ల ద్వారా నీటి సరఫరా కు చర్యలు చేపట్టాలన్నారు వేసవిలో త్రాగునీటి ఎద్దడి కలగకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు ఈ సమీక్షలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. సత్యప్రసాద్, జిల్లా పంచాయతీ అధికారి హరికిషన్, మిషన్ భగీరథ సిఇలు కె. శ్రీనివాస్, జి. చెంబాస్, లలిత, ఎస్ఇ లు సదాశివకుమార్, రాములు, ఇఇ లు వాణిశ్రీ, పుష్పలత, నరేందర్, కృష్ణారెడ్డి, శ్రీనివాస్, వంశీ, అరుణ్ కుమార్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking