బాల్క సుమన్ పై ఓయూ విద్యార్థి జేఏసీ ఆగ్రహం

ఓయూ లో సుమన్ దిష్టిబొమ్మ దహనం

ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఫిబ్రవరి06:
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై.. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఓయూ విద్యార్థి జేఏసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం మాజీ మంత్రి కేటీఆర్ ప్రోద్భలంతోనే బాల్క సుమన్ అలా మాట్లాడారని ఓయూ జేఏసీ అధ్యక్షుడు బాలకృష్ణ నేత అన్నారు. కేటీఆర్ కు బాల్క సుమన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద వారి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఒక బాధ్యత గల ముఖ్యమంత్రి పదవీ లో ఉన్న రేవంత్ రెడ్డిని… చెప్పుతో కొడతా అని నోటికి వచ్చినట్లు అసభ్యకరంగా భాష మాట్లాడిన సుమన్ పై మండిపడ్డారు. అధికారం పోయిందనే ఫ్రాస్ట్రేషన్ లో బిఆర్ఎస్ నాయకులు అహంకారంతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. బిఆర్ఎస్ నాయకులు తమ వైఖరి మార్చుకోకపోతే … రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు రాంబాబు నాయుడు, కాసిం యాదవ్ మహేష్ నేత తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking