ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఫిబ్రవరి06:
సీఎం రేవంత్ రెడ్డి పై బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలను నాచారం డివిజన్ కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండించారు. నాచారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో బాల్క సుమన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీని ప్రజలు ఓడించిన బుద్ధి రాలేదన్నారు. అధికారంలో ఉన్నప్పుడు అహంకారంతో రెచ్చిపోయారు అదే అహంకారంతో మళ్ళీ మాట్లాడుతున్నారనీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అహంకారాన్ని సహించలేకనే ఎన్నికల్లో బిఆర్ఎస్ కు ప్రజలు సరైన గుణపాఠం చెప్పారన్నారు. కేటీఆర్ బానిస అయిన సుమన్ వైఖరి మార్చుకోకపోతే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర ఎస్సీ సెల్ కన్వీనర్, హెచ్ ఆర్ మోహన్, కాంగ్రెస్ పార్టీ 6వ డివిజన్ సీనియర్ నాయకులు, కృష్ణారెడ్డి, శ్రీ రామ్ రెడ్డి,బండారి రఘు, బద్రయ్య, మెతుకు శ్రీనివాస్ రెడ్డి, రమేష్ గౌడ్, మహేష్ యాదవ్, నూతలకంటి రాజు, కృష్ణ యాదవ్, గడ్డ క్రాంతి, 6వ డివిజన్ కాంగ్రెస్ యూత్ జనరల్ సెక్రటరీ నరేందర్ యాదవ్, 6వ డివిజన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సునీల్ రెడ్డి, కొత్త వెంకటేష్ గౌడ, టోని ఫ్రాన్సిస్, శ్రీ కొప్పోజి ప్రవీణ్ చారి, ఎన్ ఎస్ వి ఐ 6వ డివిజన్ ప్రెసిడెంట్ గౌడెల్లి రాకేష్,మధు గౌడ్, రాకేష్, నరేష్, యూసుఫ్,మోయిజ్, ఖుదూజ్, బాల యాదవ్, నరేష్, శ్రావణ్, రాకేష్, నరేష్ , టి అశోక్, శ్రావన్ తదితరులు పాల్గొన్నారు