పది ,ఇంటర్ లో 100 శాతం ఉత్తీర్ణతే లక్ష్యం ——-కలెక్టరు రాజర్షి షా.

 

మెదక్ తూప్రాన్ ప్రాజబలం న్యూస్ :-

పది, ఇంటర్ లో 100 శాతం ఉత్తీర్ణత లక్ష్యం గా అధ్యాపకులు, ఉపాద్యాయులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధ్యాపకులకు సూచించారు.
మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణం లో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల,జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలుర), టి ఎస్ ఆర్ పాఠశాల , కళాశాల లను మంగళవారం జిల్లా ఇంటర్ విద్యాధికారి సత్యనారాయణ ,జిల్లా విద్యాధికారి రాధా కిషన్ లతో కలెక్టర్ రాజర్షి షా , సందర్శించారు.

ఈ సందర్భగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ పది,ఇంటర్ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించేందుకు, 100% ఉత్తీర్ణత సాధించేందుకు ఇంటి వద్ద తీసుకోవాల్సిన చర్యలు మరియు విద్యార్థుల ప్రిపరేషన్ గురించి సూచనలు చేయడం జరిగింది.
ఈ రెండు నెలల కాలం మంచిగా కష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చు అని తెలియజేశారు. విద్యార్థులను టీవీ మాధ్య మాలకు ఫోన్లకు దూరంగా ఉంచాలని వారు సరిగ్గా చదువుకున్నారా లేదా అని పరిశీలించాలని నిరంతరం అధ్యాపకులకు అందుబాటులో ఉండాలని విద్యార్థులకు సూచించడం జరిగింది.
విద్యార్థులు ప్రణాళిక బద్ధంగా చదవాలని అధ్యాపకులు ఇచ్చే సూచనలను మంచి ఫలితాలు సాధించాలని, విద్యార్థుల ప్రిపరేషన్-ప్రణాళిక గురించి వారితో ముచ్చటించాడు జరిగింది. విద్యార్థులు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులను గ్రాండ్ టెస్ట్ లను సద్వినియోగ పరుచుకోవాల ని, విద్యార్థులను పాఠశాలకు గైర్హాజరు కాకుండా చూడాలని ,చదువు తప్ప వేరే ఇతర పనులు విద్యార్థులకు చెప్పకుండా ఉండాలని తెలియజేశారు. కళాశాల లో అధ్యాపకులతో సిలబస్,విద్యార్థుల హాజరు, A.B.C.D గ్రూపు గా విభజించిన విద్యార్థుల యొక్క స్థాయి నీ తెలుసుకున్నారు. విద్యార్థులు బాగా కష్ట పడి చదివి , అధ్యాపకులకు తల్లితండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు.
తెలంగాణ రెసిడెన్షియల్ పాఠశాల,కళాశాలలో విద్యార్థులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
తెలంగాణ రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలలో అల్ఫాహారం పరిశీలించి,రుచి చూచారు.
ఈ కార్యక్రమం లో తూప్రాన్ ఆర్డీఓ జయ చందర్ రెడ్డి , తాసిల్దార్ విజయలక్ష్మి, మున్సిపాలిటీ కమిషనర్ ఖాజా మోహినోద్దిన్,
ఇంచార్జ్ ప్రిన్సిపల్ గోపీచంద్, అధ్యాపకులు,ప్రధానోపాధ్యాయులు,ఉపాద్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking