జమ్మికుంట ప్రజా బలం ప్రతినిధి ఫిబ్రవరి 6
జమ్మికుంట మండలం విలాసాగర్ గ్రామం మానేరు నుండి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ ను మంగళవారం పట్టుకున్నట్లు జమ్మికుంట ఎస్సై ఎస్.రాజేష్ తెలిపారు. మానేరు నుండి ఇసుకను తరలిస్తూ సైదాబాద్ క్రాసింగ్ వద్ద పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించి ఇసుక ట్రాక్టర్ యజమాని రాసపల్లి శ్రీకాంత్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అలాగే మరొక ట్రాక్టర్ ను ఎలాంటి రిజిస్ట్రేషన్ పత్రాలు లేకుండా మరియు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడుపుతున్న మరొక ట్రాక్టర్ ను పట్టుకొని ఎం వి ఐ హుజురాబాద్ కి చట్టారీత్యా తగు చర్యల గురించి పంపించినట్లు తెలిపారు.
ఎవరైనా అక్రమంగా ఇసుకను తరలించినట్లయితే వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకొనబడునని ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరిగిన వాటి సమాచారం తమకు అందించాలని తెలిపారు.