పోలీస్ అధికారులు తక్షణమే స్పందించి జరుగుతున్న దొంగతనాలను అరికట్టాలి.
కాంగ్రెస్ నాయకులు ఎండి అప్సర్.
మెదక్ తూప్రాన్ ఫిబ్రవరి 6 ప్రాజబలం న్యూస్:-
మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం తూప్రాన్ మున్సిపల్
పట్టణంలోనీ నాలుగు షాపుల్లో చోరీ.. సోమవారం అర్ధరాత్రి సమయంలో మణికంఠ స్టీల్ సిమెంట్ షాపుల్లో 14000 నగదుతో పాటు 20 తులాల వెండి నాణేలు, విగ్రహాలు సిల్వర్ కాయిన్స్, చోరీ, నటరాజ్ ట్రేడర్స్ లో 8000 నగదు, భాగ్యలక్ష్మి సిమెంట్ షాపుల్లో 20 వేలు నగదు పాత సామాన్ దుకాణంలో విలువైన వస్తువులను గుర్తుతెలియను దొంగలు చోరీకి పాల్పడి ఎత్తుకెళ్లినారు. చోరీకి గురైన దుకాణాలలో తూప్రాన్
యస్ ఐ. శివానందం మరియు క్లూస్ టీమ్ బృందం విచారణ చేపట్టింది. అయితే తూప్రాన్ పట్టణంలో గత కొంతకాలంగా గుర్తు తెలియని దొంగలు దొంగతనాలకు పాల్పడుతూ పట్టణ వాసులకు నిద్ర లేకుండా మనశ్శాంతి లేకుండా చేస్తున్నారని కష్టపడి పెట్టుబడి పెట్టి సంపాదించిన సంపదనాన్ని దోచుకెళడం పై సంబంధిత దుకాన్ దారులు అసహనానికి గురయ్యారు.
తూప్రాన్ పట్టణ వాస్తవ్యులు కాంగ్రెస్ నాయకులు ఎండి
Md అప్సర్ మీడియాతో మాట్లాడుతూ పోలీసు అధికారులు బృందం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి చోరీలు జరగకుండా పగడ్బందీగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరారు.
పట్టణవాసులు వారి బాధను వ్యక్తపరుస్తు చోరీలకు పాల్పడుతున్న వ్యక్తులను తక్షణమే పట్టుకోవాల్సిందిగా బాధితులు కోరారు. దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తులను తొందరలోనే పట్టుకుంటామని స్థానిక ఎస్సై శివానందం తెలిపారు.
