ఆశా వర్కర్లకు కనిస వేతనం 26 వేలు చెల్లించాలి
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 06 : ఆశా వర్కర్స్ యూనియన్ (సిఐటియు)ఆధ్వర్యంలో ఫిబ్రవరి 16న జరిగిన సమ్మె నోటీసును స్థానిక వెంకట్రావుపేట పిహెచ్సి లో డాక్టర్ కి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా శోభ ఆశ వర్కర్ యూనియన్ (సిఐటియు) జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ…ఆశ వర్కర్లకు కనీసవేతనం 26000 చెల్లించాలని,టార్గెట్ల పేరుతో అధికారుల వేధింపుల ఆపాలని, పెండింగ్ బిల్లులు చెల్లించాలని,ప్రతి ఒక్క ఆశా వర్కర్ కు పీఫ్,ఈ ఎస్ ఐ మరియు ఉద్యోగ భద్రత, ప్రతి నెల 10 వేల రూపాయల పెన్షన్ సౌకర్యం కల్పించాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాలలో ఆశాలను అర్హులుగా ప్రకటించాలి.దుంపల రంజిత్ కుమార్ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ…కేంద్ర బీజేపీ ప్రభుత్వ ప్రజా,మకార్మికు, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరి 16న జరిగే దేశవ్యాప్త కార్మికుల సమ్మె – గ్రామీణ భారత్ బందు చేపట్టాలని అఖిల భారత కార్మిక,రైతు,వ్యవసాయ కార్మిక సంఘాలు పిలుపును ఇవ్వడం జరిగింది. అఖిలభారత పిలుపుమేరకు దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణకు,కార్మిక హక్కుల కాపాడుకోవడం కొరకు,ఉపాధి హామీ రక్షణకు,రైతుల పంటలకు మద్దతు ధర కోసం, ప్రజా సమస్యల పరిష్కారానికై ఫిబ్రవరి 16న చేపట్టే దేశవ్యాప్త కార్మికుల సమ్మె – గ్రామీణ భారత్ బంద్ లో జిల్లా వ్యాప్తంగా ఆశా వర్కర్లు పాల్గొని జయప్రదం చేయగలరు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్స్ యూనియన్ నాయకులు రాణి,గురులక్ష్మి,మమత, కవిత,అపర్ణ,లలిత, హైమావతి,సత్యవతి, పద్మ,సునీత,రమ తదితరులు పాల్గొన్నారు.