కేంద్రంలో మూడో సారి వచ్చేది మోదీ ప్రభుత్వమే

బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 06 : నరేంద్ర మోదీ ప్రభుత్వం గత 10 సంవత్సరాల పాలనలో పేద ప్రజల కోసం అమలు చేసిన పథకాలు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు వివరించడానికి దేశం వ్యాప్తంగా 7 లక్షల గ్రామాల్లో ఈరోజు నుండి ప్రారంభం కానున్న “గావ్ ఛలో అభియాన్” కార్యక్రమంలో భాగంగా ఈరోజు బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి ప్రారంభించి ఇంటి ఇంటికి వెళ్ళి ప్రజలను కలిసి మోదీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది,సంక్షేమ పథకాల కరపత్రాలు అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ…మోదీ ప్రభుత్వం గత 10 సంవత్సరాల పాలనలో పేద ప్రజల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు మరియు చేపట్టిన అభివృద్ది పనులు ఇంటి ఇంటికి వెళ్ళిప్రజలకు వివరించడం జరుగుతుంది అని తెలిపారు. పేద ప్రజల కోసం ఉచిత రేషన్ బియ్యం, ఉజ్వల యోజన కింద గ్యాస్ సిలిండర్లు,ఉచిత కరోనా టీకాలు,అయుష్మాన్ భారత్ కింద 5 లక్షల రూపాయలు ఉచిత వైద్యం,కిసాన్ సమ్మన్ నిధి కింద ఏడాది కి 6000 రూపాయిలు, వరికి మద్దతు ధర పెంపు ఎలా పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు మలు చేసిన ఘనత మోదీ ప్రభుత్వానిది అని అన్నారు. దేశ వ్యాప్తంగా ప్రజలు మరొక సారి మోదీ ప్రభుత్వానికి అవకాశం ఇవ్వడనికి సిద్ధంగా ఉన్నారని అన్నారు.వచ్చే ఎన్నికల్లో మోదీ ప్రభుత్వం భారీ విజయం సాధిస్తుందని అని తెలిపారు. పెద్దపల్లి పార్లమెంట్ లో మోదీ బీజేపీ అభ్యర్ధిని గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బొప్పు కిషన్,తోట సతీష్,కండ్రపు వంశీ,నర్సయ్య, కారుకురి మధు,బియ్యాల లచ్చన్న,మలన్న తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking