ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 06 : మంచిర్యాల జిల్లా యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి,విశాఖ జె ఎమ్ డి గడ్డం వంశీ కృష్ణ చేతుల మీదుగా నియమాక పత్రాన్ని రామటెంకి శశికుమార్ కు అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా శశికుమార్ మాట్లాడుతూ…ఈ బాధ్యతల అప్పగించిన రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డికి రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఇంచార్జ్ సురభికి మరియు సోషల్ మీడియా స్టేట్ కన్వీనర్ నార్ల నిహార్ కి జిల్లా అధ్యక్షుడు తాళ్లపల్లి సంపత్ రెడ్డి కి బెల్లంపల్లి యువజన కాంగ్రెస్ నియోజకవర్గం అధ్యక్షుడు ముడిమడుగు మహేందర్ కి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ రానున్న పార్లమెంట్ ఎలక్షన్లలో పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ గెలుపు దిశగా పనిచేస్తానని వారు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తెలియజేయడం జరిగింది.