జర్నలిస్టుల హక్కుల సాధనకై నిరంతర పోరాటం

డీజేఎఫ్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి మధుచారి,లింగన్న

చలో హైదరాబాద్ కు తరలిన జర్నలిస్టులు

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 06 : జర్నలిస్టులుహక్కుల సాధనకై నిరంతరం పోరాటం చేస్తామని ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని డీజేఎఫ్ మండల అధ్యక్ష, కార్యదర్శులు మధుచారి, బైరం లింగన్న డిమాండ్ చేశారు.మంగళవారం హైదరాబాద్ జరిగే డీజేఎఫ్ మహాసభలకు బయలుదేరారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ…ఎన్నో అవంతరాలను ఎదుర్కొని సమాజ సేవ చేసేది జర్నీలిస్టులేనన్నారు. ప్రభుత్వం ద్వారా అమలయ్యే సంక్షేమ పథకాలను జర్నలిస్టులకు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు గడికొప్పుల కిష్టయ్య,జిల్లా ఉపాధ్యక్షులు కుసనపెల్లి సతీష్,మండల అధ్యక్షులు రాంపల్లి మధుచారి,ప్రధాన కార్యదర్శి బైరం లింగన్న, ఉపాధ్యక్షులు మేడి భానుచందర్,మంద మల్లేష్, తిరుపతి,ఓరుగంటి సత్తన్న, శివ,శ్రీనివాస్,రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking