గిట్టుబాటు ధర కల్పించి, జీవనోపాధి కి భరోసా ఇవ్వాలి
దిగుమతి సుంకాలు పెంచాలి
డైనమిక్ ఇంపోర్ట్ డ్యూటీ మెకానిజం ను రూపొందించాలి
విదేశీ పోటీ నుంచి దేశీయ రైతులను ఆదుకోవాలి
దేశీయ ఆయిల్ ఫామ్ రైతుల సమస్యలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కి లేఖ రాసిన ఎంపీ నామ నాగేశ్వరరావు
ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి 06 (ప్రజాబలం) ఖమ్మం దేశీయంగా ఆయిల్ ఫామ్ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించి, సత్వరమే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కోరారు. ఎంపీ నామ ఈ మేరకు ప్రధాన మంత్రి కి ప్రత్యేకించి, లేఖ రాశారు. ఆయిల్ ఫామ్ సాగుకు సంబంధించిన వయబిలిటీ మద్దతు ధరను సవరించడం ద్వారా ఆయిల్ పామ్ రైతులకు లాభదాయ కమైన ధర కల్పించి, వారి జీవనోపాధికి భరోసా కల్పించి, ఆదుకోవాలన్నారు దేశీయ ఆయిల్ ఫామ్ రైతులను రక్షించడానికి సీపీవో (క్రూడ్ పామ్ ఆయిల్)పై దిగుమతి సుంకాలు విధించడం ద్వారా దేశీయ రైతులనుఅదుకోవచ్చని నామ పేర్కొన్నారు. దేశంలో ఎడిబుల్ ఆయిల్ స్వయం సమృద్ధిని సాధించడానికి, రైతుల జీవనోపాధి మెరుగు పడాలంటే “డైనమిక్ ఇంపోర్ట్ డ్యూటీ మెకానిజం”ను రూపొందించి, దిగుమతి సుంకాలను మళ్లీ విధించాలన్నారు. తద్వారా అనవసరమైన విదేశీ పోటీ నుండి దేశీయ ఆయిల్ పామ్ రైతుల జీవనోపాధిని కాపాడటానికి అవకాశం ఉంటుందని చెప్పారు. సాగు ఖర్చు కవర్ అయ్యేలా సీపీవో ధరను టన్నుకు రూ. 1,20,000 గా కొనసాగేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారని నామ మోడీ దృష్టికి తీసుకెళ్లారు
సీపీవో సుంకం రహిత దిగుమతులు
దేశవ్యాప్తంగా ఆయిల్ పామ్ , ఇతర ఆయిల్ సీడ్స్ రైతులపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని లేఖలో నామ పేర్కొన్నారు. మే 2022 నెలలో టన్నుకు రూ. 23,635 ఉన్న ప్రెష్ ప్రూట్ బంచ్ ( ఎఫ్ఎఫ్ బి ) ధర అక్టోబర్ 2023 నాటికి రూ. 12,100 కి పడిపోయిందన్నారు.ఫలితంగా CPO ధరలు టన్నుకు రూ.1,45,000/- నుండి రూ.74,000కిపడిపోయాయని, గతంలో 49 శాతంగా ఉన్న దిగుమతి సుంకాలుఊహించని విధంగా ఏప్రిల్ 2022 నాటికి సున్నాకి చేరాయని, ఇది రైతులకు భారీ నష్టాన్ని కలిగిస్తుందని పేర్కొన్నారు 2017 సంవత్సరంలో ఆయిల్ పామ్ రైతులు ప్రతి టన్ను ఎఫ్ఎఫ్ బికి రూ.13,000 చొప్పున ఆయిల్ పామ్ సాగు ఖర్చును పరిగణనలోకి తీసుకున్నారని, కానీ ఇప్పుడు ఎరువులు , ఇతర ఇన్‌పుట్ ఖర్చులు 100 శాతం కంటే ఎక్కువ పెరిగాయని చెప్పారు. ప్రతి టన్ను ఎఫ్ఎఫ్ బి ఉత్పత్తి వ్యయం రూ. 18,000 కి పెరిగిందన్నారుకానీ దురదృష్టవశాత్తు ప్రభుత్వ వయబిలిటి మద్దతు ధర చాలా తక్కువుగా ఉందన్నారు సాధ్యత ధర ఫార్ములాలో ఉప-ఉత్పత్తుల (గింజలు) విలువను కలిగి ఉండదని, బాధ్యత ధర ఒఇఆర్ లో 19 శాతం ఉంటుందని, దీని వల్ల రైతులకు భారీ నష్టo కలుగుతుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు ఇప్పుడు ఒఇఆర్లో 19.32 శాతం లో 14.54 శాతం వాటా, ఉప-ఉత్పత్తులలో (గింజలు) 75.25 శాతం వాటా ఇవ్వబడుతోందని, ఇది మొత్తంగా ఒఇఆర్లో22శాతానికి దగ్గరగా వస్తుంది కాబట్టి, ప్రభుత్వం ప్రకటించిన విధంగా 19 శాతం కాకుండా దాదాపు 22 శాతం ఉండే ఉప- ఉత్పత్తుల విలువను చేర్చాలని నామ కోరారు అంతే కాకుండా ఎంఓయూ షరతులను వర్తింప జేయకుండా భవిష్యత్తులో సీపీవో ధరలను పెంచిన తర్వాత కూడా ప్రస్తుత ధర సూత్రం వలె గింజల వాటాను చేర్చడం ద్వారా వయబిలిటీ ధర సూత్రాన్ని కొనసాగించాలని రైతులు ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారని పేర్కొన్నారు. సానుకూలంగా స్పందించి, వయబిలిటీ ధరను సవరించడానికి సాగు ఖర్చును కవర్ చేయడానికి లాభదాయకమైన ధరను ప్రకటించడానికి అన్ని వాటాదారులతో నిర్వహించే సమావేశానికి పిలవాలని ఎంపీ నామ నాగేశ్వరరావు ప్రధాన మంత్రి ని కోరారు.