రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ మరియు కీహోల్ ఆర్థోపెడిక్ సర్జరీపై అవగాహన కల్పించిన యశోద డాక్టర్ సునీల్ దాచేపల్లి
ఖమ్మం ప్రతినిధి మార్చి22 (ప్రజాబలం) ఖమ్మం నగరంలో స్థానిక ప్రెస్ క్లబ్ లో రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ మరియు కీహోల్ ఆర్థోపెడిక్ డాక్టర్ సునీల్ దాచేపల్లి యశోద హాస్పిటల్ సోమాజిగూడ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క సమావేశంలో వారు మాట్లాడుతూ ఇప్పటివరకు మోకాళ్ళకు సంబంధించిన ఆపరేషన్లు సుమారు 15 వేల పైగా చేయడం జరిగిందని దీనిలో 400 రోబోటిక్ సర్జరీలు చేయడం జరిగిందని తెలిపారు మోకాళ్ళు అరిగిపోతే ఆపరేషన్లు చేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదని అందుకని ప్రజలలో అపోహ పోవాలని మా చిరు ప్రయత్నం అని తెలిపారు . మొదటి రెండు స్టేజీలలో ఇంజక్షన్ సరిపోతుందని అన్నారు తరవాత రెండు స్టేజీలలో మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ చాలా సక్సెస్ అవుతాయని తెలిపారు మోకాళ్ళ అరుగుదలకు పలు రకాల వైద్యాలు అందుబాటులో ఉన్నాయని లాస్ట్ స్టేజి మాత్రం ఆపరేషన్ మాత్రమే సక్సెస్ అవుతుందని చెప్పారు రోబోటిక్ సర్జరీ ద్వారా నొప్పి తక్కువ ఉండి గాటు తక్కువ ఉండి ఫిజియోథెరపీ కూడా చాలా సులువుగా అవుతుందని ప్రముఖ వైద్యులు తెలిపారు