ఖమ్మం ప్రతినిధి మార్చి 22 (ప్రజాబలం) ఖమ్మం ఎన్.ఆర్.ఐ పేరెంట్స్ అసోసియేషన్ ఖమ్మం జిల్లా ఎన్నారై పేరెంట్స్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశం ఉదయం 10 గంటలకు వాసిరెడ్డి ఫంక్షన్ హాల్ నందు నిర్వహించడం జరిగింది. ఈ సమావేశమునకు జిల్లా కమిటీ అధ్యక్షులు ఎం స్వరూప రాణి అధ్యక్షత వహించారు ఈ రెండు సంవత్సరాల కాలం కాలంలో అసోసియేషన్ చేసిన కార్యక్రమాలు వివరించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ తాత మధు హాజరై అసోసియేషన్ అవశ్యకత మరియు మన పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తుత పరిస్థితులను వివరిస్తూ రాబోయే కాలంలో అసోసియేషన్ ద్వారా పూర్తిస్థాయి కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలని అదేవిధంగా ఇతర దేశాల్లో ఉన్న మన పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని తెలియజేసినారు ఈ సమావేశంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రిపోర్ట్ ప్రవేశపెట్టి తదుపరి దానిపై చర్చలో పాల్గొని తన కమిటీ రిపోర్ట్ ని ఆమోదించడం జరిగింది తదుపరి నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సమావేశంలో గౌరవ అధ్యక్షులు బత్తిని నీరజ ఉపాధ్యక్షులు వై శ్రీనివాసరావు దుగ్గి లక్ష్మీ రాయల రవికుమార్ నెల్లూరు వీరబాబు కార్యవర్గ సభ్యులు హాజరై హాజరైనారు జనగణమన అధినాయక జయహే అనే జాతీయ గీతంతో వందల సమర్పణతో ముగించారు
