మధిర మండలంలో ఘనంగా అంగన్వాడి పోషణ్ పక్వాడా కార్యక్రమంలో పాల్గొన్న సిడిపిఓ శారద శాంతి ఎంపీడీవో వెంకటేశ్వరరావు
సంపూర్ణ ఆరోగ్యం కై పిల్లలకు పౌష్టిక ఆహారం అందించాలి సిడిపిఓ శారద శాంతి
పోషణ్ పక్వాడ కార్యక్రమంలో భాగంగా గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం కార్యక్రమంలో సిడిపిఓ శారద శాంతి
ఖమ్మం ప్రతినిధి మార్చి 22 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా మధిర ప్రాజెక్టు ఐసిడిఎస్ ఆధ్వర్యంలో మధిర మండల స్థాయి పోషణ్ పక్వాడ కార్యక్రమాన్ని మధిర టు సెక్టార్ సిరిపురం రైతు వేదికలో సెక్టార్ సూపర్వైజర్ జక్కుల నాగ సత్యవతి ఆధ్వర్యంలో పోషణ పక్వాడా కార్యక్రమంలో సిడిపిఓ శారద శాంతి పాల్గొని మాట్లాడుతూ… అంగన్వాడి కేంద్రాల ద్వారా మహిళల ఆరోగ్య రక్షణ కోసం, చంటి పిల్లల ఎదుగుదల కోసం, పౌష్టికాహారాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ అంగన్వాడీ సెంటర్ల సేవలను సద్వినియోగం చేసుకొని ఆరోగ్యవంతమైన జీవితాన్ని పొందాలని మహిళలకు,గర్భిణీలకు, చంటి పిల్లల తల్లులకు, చిన్నారులకు సూచించారు. కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ టీచర్లు స్వయంగా తయారు చేసి తీసుకొచ్చిన తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను ప్రదర్శించి తయారు చేసుకునే విధానాలను గర్భిణీలకు, బాలింతలకు అర్థమయ్యే విధంగా వివరించారు. మంచి పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం వలన రక్తహీనత సమస్యలు దరి చేరవు అన్నారు. పుట్టబోయే బిడ్డ మంచి ఆరోగ్యవంతుడిగా పుడతాడని తెలిపినారు.గర్భిణీగా గుర్తించిన వెంటనే అంగన్వాడీ కేంద్రంలో తమ పేరును నమోదు చేసుకోవాలి అన్నారు. కేంద్రంలో ప్రతినెల పిల్లల బరువులు,ఎత్తులు పర్యవేక్షించి టీచర్లు తల్లులకు ఇచ్చే సూచనలు సలహాలు పాటించాలని తెలిపినారు. ఆరోగ్య లక్ష్మి ద్వారా అందించే పోషక విలువలు కలిగిన ఆహారాన్ని ప్రతిరోజు కేంద్రాలకు వచ్చి తీసుకోవాలన్నారు.

మూడు సంవత్సరాల నిండిన పిల్లలందరినీ అంగన్వాడీ సెంటర్ కి పంపించాలని తెలిపినారు.గర్భిణీలు, బాలింతలు,పిల్లలకు అంగన్వాడి కేంద్రం ద్వారా అందించే వ్యాధి నిరోధక టీకాలను తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. అనంతరం గర్భిణీలకు సామూహిక సీమంతాల , అన్నప్రాసనా, అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏ సి డి పి ఓ కృష్ణ శ్రీ, హెల్త్ డిపార్ట్మెంట్ భాస్కరరావు, సూపర్వైజర్స్ శశి షర్మిలాదేవి, మాలతి, బి జాన్ బి, జ్యోతి,సుజాత, అన్నపూర్ణమ్మ, పి సరిత, టి సరిత,కే సుజాత మరియు పోషణ్ అభియాన్ సిబ్బంది, ఆఫీసు స్టాప్, మధిర మండల స్థాయి అంగన్వాడీ టీచర్స్, ఆయాలు, హెల్త్ సూపర్వైజర్ భాస్కరరావు, ఏ ఎన్ ఎమ్స్ సుజాత,ఝాన్సీ, ఆశ వర్కర్స్, గర్భిణీలు, బాలింతలు చిన్నపిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు