అక్షయ విద్య కమ్యూనిటి లెర్నింగ్ అండ్ స్కిల్స్ ట్రైనింగ్ సెంటర్ ప్రారంభోత్సవంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఫిబ్రవరి 24:
విద్య బలమైన ఆయుధమని ఈ ఆయుదాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని తెలంగాణరాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు.
సోమవారం కూకట్ పల్లి మండలంలోని ఎల్లమ్మ బండ లో అక్షయ విద్య కమ్యూనిటి లెర్నింగ్ అండ్ స్కిల్స్ ట్రైనింగ్ సెంటర్ ను గవర్నరు ప్రారంభించారు.ఈ కమ్యూనిటి హాల్ లో చిన్నారులకు అవసమైన మౌళిక వసతులు ఏర్పాటు చేసారన్నారు. చిన్న చిన్న ప్రైవెటు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న 1 నుండి 6 వతరగతి చిన్నారులకు ప్రతిరోజు సాయంత్రం 6 నుండి 8 గంటల వరకు ఉచితంగా ఇక్కడ చదువు చెప్పడము ఎంతో హర్షనీయమని గవకర్నర్ అన్నారు.ఈ ప్రాంతంలో ఇంటర్ డిగ్రీ చదువుకునే విద్యార్థులే వీరికి పాఠాలు చేప్పడం ఎంతో సంతోషకరమైన విషయమన్నారు.ఈ సెంటర్ ను నిర్వహిస్తున్న అక్షయ ఫౌండేషన్ వారికి గవర్నర్ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూకట్ పల్లి ఎంఎల్ఎ అరికెపూడి గాంధీ, మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరు గౌతం, అక్షయ పౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
