విద్యార్థుల భవిష్యత్తు విద్యకై కలెక్టర్ సలహాలు

ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఫిబ్రవరి 24:
పదవ తరగతి తరువాత ఏ దిశగా వెళ్లాలనే అంశాం పై విద్యార్థులకు క్షుణ్ణంగా అర్థమయ్యేలా మార్గనిర్దేశం చేసి వారి భవిష్యత్తుకు చేయుతనందించేలా అన్ని పాఠశాలలోని ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరు గౌతం సూచించారు.
సోమవారం కూకట్ పల్లి మండలంలోని ఎల్లమ్మబండ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టరు తనిఖీ చేసారు. ఈ సందర్భగా కలెక్టరు మాట్లాడుతూ పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు పదవ తరగతి తరువాత ఏ కోర్సు తీసుకోవాలి అనే అంశం పై వారికి క్షుణ్ణంగా అర్థమయ్యేలా దిశ నిర్దేశం చేయాలని అన్ని పాఠశాలలల ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని కలెక్టరు సూచించారు. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు మంచి కోర్సులను ఎంచుకొని మంచి భవిష్యత్తులు ఏర్పాటు చేసుకునేలా చూడాలని కలెక్టరు తెలిపారు. కృషి, పట్టుదల, క్రమశిక్షణతో పదవ తరగతిలో విజయం సాధించి భవిష్యత్తులో ఏమి చదవాలి అనే లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఆదిశగా ముందుకు వెళ్లాలని మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతం విద్యార్థులకు తెలిపారు. పదవ తరగతిలోని ప్రతి విద్యార్థితో ముచ్చటించారు. భవిష్యత్తులో ఏమి చదువుతారని, ఏగ్రూపు తీసుకుంటారని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తు విద్యకై అవసరమైన సలహాలను కలెక్టరు విద్యార్థులకు వివరించారు. కష్టపడి చదివి మంచి మార్కులు సాధించాలని, విద్యతోనే భవిష్యత్తు బాగుంటుందని తెలిపారు. సిలబస్ పూరైందా అని, రివిజన్ ఎలా జరుగుతుందని, స్కూల్లో వసతులు ఏలా ఉన్నాయని, భోజనం ఎలా ఉంటుందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు రాష్ట్ర విద్యాశాఖ ద్వారా అందజేసే ఎఫ్ ఎల్ ఎన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ద్వారా, పాఠశాలలో భాషా గణిత సామర్థ్యాలలో వెనుకబడిన విద్యార్థులను ప్రత్యేకంగా గుర్తించి ప్రత్యేకమైన టూల్ ద్వారా విద్యార్థులలో సామర్ధ్యాలను పెంపొందించేందుకు ఏర్పాటు చేసిన ల్యాబును కలెక్టరు ప్రారంభించారు. ప్రతి విద్యార్థి 20 నిమిషాల నిడివితో పాఠలు వినాలని తప్పనిసరిగా నాలుగురోజులు హాజరయ్యేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ద వహించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆర్డిఓ శ్యాంప్రకాష్, తహాసీల్దారు స్వామి, డిఈఓ విజయ కుమారి, పాఠశాల హెడ్ మాస్టర్, తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking