బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 15 : వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలుపుకోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ పేర్కొన్నారు. శుక్రవారం లక్షెట్టిపేట మండల నూతన కమిటీలను బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి ప్రకటించారు.ఈ సందర్భంగా నూతనంగా నియామకం అయిన వారు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా పని చేయాలని రఘునాథ్ సూచించారు.
నూతన కమిటీ ఎన్నిక మండల అధ్యక్షుడిగా బొప్పు కిషన్,ప్రధాన కార్యదర్శులుగా నాగిరెడ్డి హేమంత్ రెడ్డి,తోట సతీష్ కుమార్,పెట్టం శ్రీరామ్, ఉపాధ్యక్షులుగా వొడ్నాల శ్రీరామ్,ఎంబడి తిరుపతి, రవి,దనిశెట్టి అంజన్న, బుద్దె సత్తన్న,బొక్కనపెల్లి సతీష్, కార్యదర్శులుగా చిందం శ్రీనివాస్,తూటి మల్లేష్, సారం వినోద్, గుర్రాల శ్రీపాల్ రెడ్డి,కేతిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి, మోటపలుకుల మల్లేష్ లను కోశాధికారిగా గుర్రాల రవీందర్ రెడ్డి, మహిళా మోర్చా అధ్యక్షురాలుగా తొగటి పద్మ, కిసాన్ మోర్చా అధ్యక్షుడిగా మండే శ్రీనివాస్ ,బీసీ మోర్చా అధ్యక్షుడిగా బియ్యాల లచ్చన్న ,ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా తగరపు గంగన్నను నియమించడం జరిగింది.