తైక్వాండో కరాటే పోటీల్లో సిద్దార్థ్ విద్యార్థుల ప్రతిభ

ఆత్మరక్షణకు కరాటే దోహదం..
మెదక్ డీఎస్పీ రాజేష్

మెదక్ ప్రాజబలం న్యూస్:-

కరాటే ఆత్మరక్షణకు ఎంతో దోహదడుతుందని మెదక్ డీఎస్పీ రాజేష్ పేర్కొన్నారు. గురువారం స్థానిక వెంకట్రావు నగర్ కాలనీలోని సిద్దార్థ్ విద్యా సంస్థల్లో నిర్వహించిన తైక్వాండో కరాటే పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. విద్యార్థులు చదువులు తోపాటు శారీరక దారుఢ్యం కలిగి ఉండాలన్నారు. సిద్దార్థ్ విద్యా సంస్థల అధినేత శ్రీనివాస్ చౌదరి మాట్లాడుతూ.. విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. ప్రిన్సిపాల్ సంధ్యారాణి మాట్లాడుతూ.. మెదడుకు చదువు ఎంతో ముఖ్యమో.. శరీరానికి వ్యాయామం కూడా అంతే ముఖ్యమన్నారు. అనంతరం కరాటే పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బెల్టులు ప్రధానం చేసి.. అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గ్రాండ్ మాస్టర్ ప్రవీణ్ కుమార్, సెక్రటరీ కృష్ణ, వ్యాయమ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking