న్యాయ వాదుల సమస్యల పరిష్కారానికి కృషి

న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ లీగల్ సెల్ పక్షాన కృషి చేస్తున్నామని లీగల్ సెల్ జిల్లా చైర్మన్ కల్లేపల్లి లక్ష్మయ్య తెలిపారు. శనివారం కరీంనగర్లోని ఇందిరా గార్డెన్లో జరిగిన లీగల్ సెల్ జిల్లా సమావేశంలో ఆయన మాట్లాడారు. న్యాయవాదులు దాడులకు గురవుతూ, అనేక రకాల సమస్యలు ఎందుర్కొంటున్నారన్నారు. న్యాయవాదులకు సంబంధించిన పలు సమస్యలపై ఈ సమావేశంలో తీర్మాణం చేసినట్లు తెలిపారు. ఈ తీర్మాణాలను లీగల్ సెల్ రాష్ట్ర చైర్మన్ పొన్నం అశోక్ గారికి విన్నవించి సమస్యలను పరిష్కరించేందుకు కృషిచేస్తామన్నారు.
1 న్యాయవాదులకు రక్షణ చట్టం కావాలి.
2. హెల్త్ ఇన్సూరెన్స్ ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచాలి. 3 . ఎస్సీ, ఎస్టీ, బీసీ జూనియర్ న్యాయవాదులకు రూ . 10000 స్కాలర్షిప్ ఇవ్వాలి.
4. గత ప్రభుత్వ హయాంలో నియమించిన పీపీలను వీలైనంత తొందరగా తొలగించేందుకు జీవో తీసుకురావాలి.
5. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన లీగల్ సెల్ న్యాయవాదులను పీపీలుగా నామినేట్ చేయాలి.
6. న్యాయవాదులకు సంవత్సరాల తర్వాత పెన్షన్ విధానాన్ని ప్రవేశ పెట్టాలని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో లీగల్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షడు రూపిరెడ్డి దేవేందర్ రెడ్డి, జిల్లా కన్వీనర్లు కొత్తకొండా శంకర్, లింగంపెళ్లి శ్రీకాంత్, యం డి నవాజ్, సీనియర్ న్యాయవాదులు పెంచాల లక్ష్మన్ రావు, రాచకొండ ప్రభాకర్, వి బాలకిషన్ రావు, బి మురళి మనోహర్, డి వి రమణ, మంచికట్ల రాజేశం, కొత్త ప్రకాశ్, గాదం స్వామి తేజ, జి మహేందర్, బి రాజ్, జి దిలీప్, యం సుజిత్ కుమార్ తదితులున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking