ఉద్యోగ ఉపాధ్యాయులకు నగదు రహిత వైద్య సేవలను అందించేందుకు కృషి చేస్తా

 పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి

జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి అక్టోబర్ 26

ప్రైవేటు ఉద్యోగ,ఉపాధ్యాయులకు అన్ని ఆసుపత్రులలో నగదు రహిత వైద్య సేవలు అందించే విధంగా శాయశక్తుల కృషి చేస్తానని రాజ్యాంగంలో కల్పించబడ్డ హక్కులను దరి చేర్చబడమే లక్ష్యంగా పనిచేస్తానని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు.శనివారం జమ్మికుంట పట్టణ కేంద్రంలో పలు పాఠశాలల్లో ప్రచారం నిర్వహించారు. జమ్మికుంట కు విచ్చేసిన నరేందర్ రెడ్డి కి స్థానిక యువత అయ్యప్ప టెంపుల్ నుండి గాంధీ విగ్రహం వరకు బైక్ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు.

మహాత్మా గాంధీ,డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూల మాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలకు అనుమతులు ఇచ్చే సమయంలో కఠినతరమైన నిబంధనలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ఫైర్ సేఫ్టీ,క్రీడా మైదానాలు, నీటి వసతుల తదితర అంశాలను ప్రభుత్వం పరంగా అందించేందుకు కృషి చేస్తారని అన్నారు.రాబోయే రోజుల్లో ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు మినిమమ్ బేసిక్ శాలరీ అమలు జరిగే విధంగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామని అన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు డిగ్రీ పీజీ కళాశాల యజమాన్యాలకు పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదలకు సహకరిస్తానని హామీ ఇచ్చారు..రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలనికోరారు.ప్రతి ఒక్క పట్టభద్రుడు నవంబర్ 6 లోపు తమ యొక్క ఓటు నమోదును చేసుకోవాలని పిలుపునిచ్చారు. మిస్డ్ కాల్ క్యాంపెయిన్ ద్వారా ఓటరు నమోదు కార్యక్రమం చేపడుతున్నామని ప్రతి ఒక్కరూ ఈఅవకాశాన్నివినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో యూత్ నాయకులు అర్జున్,చిరంజీవి,రత్నాకర్, సుమంత్ తదితరులు పాల్గొన్నారు

     

Leave A Reply

Your email address will not be published.

Breaking