మెదక్ తూప్రాన్ అక్టోబర్ 26 ప్రజాబలం న్యూస్ :-
మెదక్ జిల్ల తూప్రాన్ మరియు కిష్టాపూర్ హల్దీ వాగు గద్దర్ లిఫ్ట్ ఇరిగేషన్ నుండి నీటి అక్రమ తరలింపును వెంటనే ఆపివేయాలని ఆర్డీవో, డిప్యూటీ ఎమ్మార్వో,ఇరిగేషన్ అధికారులకు నీటిపారుదల రైతులు శనివారం వినతిపత్రం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. తూప్రాన్, కిష్టాపూర్ మధ్యగల హల్దీవాగు తూప్రాన్, తల మాణిక్యమైన గద్దర్ లిఫ్ట్ ఇరిగేషన్ వద్ద నుండి కిష్టాపూర్ రోడ్డు మార్గమున యావాపూర్ శివారులో గల సర్వే నెం. 385, 383, 382, 386, 387 నెంబర్ లలో గల PP ల్యాండ్ మరియు ఇతర సర్వే నెంబర్ లో గల భూమి సుమారుగా 85 నుండి 90 ఎకరాల భూమి ఉందన్నారు. వ్యక్తీ కొందరి సహకారముతో 40 HP మోటార్ సహాయముతో నేటిని మలించుకు వెళ్తున్నారని ఆరోపించారు. దీంతో తామంతా రోడ్డున పడతామని, అధికారులు వెంటనే స్పందించి నేటి మళ్లింపును అడ్డుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో దాసరి ఆంజనేయులు,
మామిండ్ల అనిల్,దాసరి స్వామి , దుర్గయ్య,పిట్ల పోచయ్య,చుక్క రవి,శ్యామ్ రెడ్డి,శ్రీశైలం గౌడ్,విజయ్, లింగం,కిష్టాపూర్ గ్రామస్తులురైతులు పాల్గొన్నారు.