ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ కు ఘన సన్మానం

 

జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి అక్టోబర్ 26

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ను కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. వేములవాడ ఎమ్మెల్యే,రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత జమ్మికుంటకు తొలిసారి ఓ ప్రైవేటు ఫంక్షన్ కు హాజరు కాగా మున్నూరు కాపు సంక్షేమ సంఘం నియోజకవర్గ ఇన్చార్జ్, రాష్ట్ర కార్యదర్శి పొనగంటి మల్లయ్య ఆధ్వర్యంలో శనివారం జమ్మికుంట మండల కేంద్రంలో శాలువా తో ఘనంగా సన్మానించారు. మున్నూరు కాపు సంఘం వర్ధిల్లాలలి ఆది శ్రీనివాస్ నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి ఏబూషి శ్రీనివాస్, కౌన్సిలర్లు పొనగంటి రామ్మూర్తి, మేడిపల్లి రవీందర్, పొనగంటి సారంగం, ధర్మారం సింగిల్ విండో వైస్ చైర్మన్ మేడిపల్లి మొగిలి, నాయకులు ఆకుల నారాయణ,కామిశెట్టి మల్లయ్య, పొనగంటి రవీందర్, పొనగంటి విష్ణు, మధు, రమేష్ ,తిరుపతి, ఉపేందర్ ,సతీష్, సురేష్, కుమార్, ఏ బూసి సంపత్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking