ప్రజలు అప్రమత్తంగా ఉండండి ప్రభుత్వం అండగా ఉంటుంది.
ప్రతి కాలనీలో మురికి కాలువ సమస్యలు ఉన్నాయి.
జమ్మికుంట ప్రజా బలం ప్రతినిధి సెప్టెంబర్ 3
జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని హౌసింగ్ బోర్డ్ కాలనీతోపాటు, పిట్టల వాడ, అంబేద్కర్ కాలనీ, ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఏరియా లో,16 వ వర్డ్ ,మోతుల గూడెం, కాలనీ లో గత రెండు రోజుల క్రితం కురిసిన వర్షాలతో నీట మునిగిన ఇండ్లను హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వొడితల ప్రణవ్ సందర్శించారు. ఈ సందర్భంగా పలువురు వరద భాదితులు ప్రణవ్ కు తమ సమస్యలు తెలియజేశారు. ప్రతి సంవత్సరం వర్షాలు వచ్చాయంటే ఇంట్లోకి నీళ్లు వచ్చి వస్తువులన్నీ తడిచిపోతున్నాయని, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. ఎగువన ఉన్న మడిపల్లి, కొత్తపల్లి శ్రీరాముల పల్లి గ్రామాల నుండి వరద నీరు దిగువన ఉన్న హౌసింగ్ బోర్డ్ కాలనీలోకి వస్తున్నాయని . గతంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు వచ్చి వరద కాలువ నిర్మిస్తామని హామీ ఇచ్చారు తప్ప ఇప్పటివరకు పనులను ప్రారంభించలేదని కాలనీవాసులు ప్రణవ్ కు మొరపెట్టుకున్నారు. అనంతరం ప్రణవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి కుటుంబానికి అండగా ఉంటుందని, వరద కాలువలు నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేసే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అందుబాటులో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు బాధితులకు సహాయ సహకారాలు అందించాలని అన్నారు.
వోడితల ప్రణవ్ వెంట మున్సిపల్ కౌన్సిలర్లు,కాంగ్రెస్ నాయకులు,
కార్యకర్తలు, పాల్గొన్నారు.
