టీచర్స్ ఎమ్మెల్సీ ప్రచార కార్యక్రమంలో
ఎమ్మెల్సీ అభ్యర్థి సంగం రెడ్డి సుందర్ రాజు యాదవ్
ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి 8 (ప్రజాబలం) ఖమ్మం తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ దయనీయమైన పరిస్థితిలో ఉందని, ఎడ్యుకేషన్ వ్యవస్థ ను మెరుగుపరచడానికి మరియు ఉపాధ్యాయుల సంక్షేమం అభివృద్ధి కోసం కృషి చేస్తానని, వరంగల్ ఖమ్మం నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి సంగం రెడ్డి సుందర్ రాజు యాదవ్ అన్నారు అఖిల భారత యాదవ మహాసభ ఖమ్మంజిల్లా కార్యాలయం లోజిల్లా యాదవ యువజన అధ్యక్షులు చిత్తారు సింహాద్రి యాదవ్ అధ్యక్షతన శనివారంజరిగిన విలేకరుల సమావేశం లో సంగం రెడ్డి సుందర్ రాజు యాదవ్ పాల్గొని మాట్లాడుతూ. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ ఉపాధ్యాయులు ఆచార్యులు పరిస్థితి బతకలేక బడిపంతులు అన్న చందంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా వ్యవస్థ మంచిగుంటేనే దేశం బాగుపడుతుందన్నారు , దేశానికి ముగ్గురు ముఖ్యమని అన్నం పెట్టే రైతన్న,దేశ సరిహద్దు లలో సైనికుడు, మానవ వనరులు తయారుచేసే ఉపాధ్యాయులు ముఖ్యం అన్నారు . ప్రభుత్వ, ప్రైవేటు టీచర్ల సమస్యలు, వ్యవస్థ తెలిసిన వ్యక్తిగా వారి సమస్యల పరిష్కారానికి చట్టసభల్లో పరిష్కరించేందుకు తాను టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని చెప్పారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రివర్యులు సంగం రెడ్డి సత్యనారాయణ గారి కుమారుడైన సుందర్ రాజు యాదవ్ సామాజిక సేవా కార్యక్రమాలలో చాలా ముందు ఉంటారని, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుందర్ రాజ్ యాదవ్ ను గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని జిల్లా అధ్యక్షులు చిలకల వెంకట నరసయ్య, చిత్తారు సింహాద్రి యాదవ్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎనిక వెంకటేశ్వరరావు దుభాకుల వెంకటేశ్వర్లు చేతుల నాగేశ్వరరావు మొరి మేకల కోటయ్య పొదిలి సతీష్, బమ్మిడి శ్రీనివాస్ యాదవ్ బండార్ ప్రభాకర్ మల్లేష్ సత్తి వెంకన్న లింగరాజుతుప్పటి రవికుమార్, జూపూడి నాగార్జున చంద్రకాని రమణ తదితరులు పాల్గొన్నారు