వర్కింగ్ జర్నలిస్టు లకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి స్పష్టమైన హామీ
ఎల్బీనగర్ మే 30 ();: ఎల్బీనగర్ నియోజకవర్గంలోని పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు నిరంతరంగా కృషి చేస్తానని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి పేర్కొన్నారు. ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ ఎల్బీనగర్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవీ రెడ్డి సుధీర్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొంతమంది పాత్రికేయులను కీలుబొమ్మలుగా వాడుకొని దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఎన్నికలలో గెలుపు ఓటములు సహజం. ప్రతిపక్షాలు సమస్యలు సృష్టించి దుష్ప్రచారం చేస్తూ లబ్ధి పొందాలని అనుకోవడం మూర్ఖత్వానికి నిర్దర్శనమని అన్నారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా ఎల్బీనగర్ నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని తెలిపారు. అతి త్వరలో పాత్రికేయులకు తీపి కబురు వినిపిస్తామని అనడంతో పాత్రికేయులు హర్షం వ్యక్తం చేశారు. ఎల్ బి నగర్ వర్కింగ్ జర్నలిస్టుల అసోసియేషన్ అధ్యక్షులు పి అశోక్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ నియోజకవర్గంలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు స్థలాల సాధన కోసం ఎల్బీనగర్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ను నూతనంగా రిజిస్ట్రేషన్ చేయించడం జరిగిందని తెలిపారు .నూతనంగా ఏర్పడిన ఎల్బీనగర్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరడంతో ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించడంతో పాత్రికేయులు హర్షం వ్యక్తం చేస్తూ ఎల్ బి నగర్ చౌరస్తాలో ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఎంతోకాలంగా ఎల్బీనగర్ నియోజకవర్గంలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల సాధన కోసం తాము నూతనంగా అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ అసోసియేషన్ ద్వారా ప్రతి వర్కింగ్ జర్నలిస్టుకి ఇళ్ల స్థలాలు వచ్చేలా పనిచేస్తామని హామీ ఇచ్చారు. త్వరలోనే జర్నలిస్టులకు న్యాయం జరిగేలా చూస్తానని హామీనిచ్చారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో అసోసియేషన్ సభ్యులు, జర్నలిస్టులు పాల్గొన్నారు.
Next Post