సీఎం కేసీఆర్ సభను జయప్రదం చేయండి-

 

 

నిర్మల్ నియోజకవర్గస్థాయి బీఆర్‌ఎస్‌ ముఖ్య నాయకుల సమావేశంలో మంత్రి ఇంద్రకరణ్

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. నిర్మల్ జిల్లా కేంద్రంలో జరిగే సీఎం కేసీఆర్‌ భారీ బహిరంగను విజయవంతం చేయాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కోరారు. నిర్మల్ పట్టణం దివ్యా గార్డెన్ లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ నియోజకవర్గస్థాయి ముఖ్యకార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వచించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ….. జూన్ 4న నిర్మల్ జిల్లా సమీకృత కలెక్టర్‌ కార్యాలయం, పార్టీ జిల్లా కార్యాలయాన్ని సీఎం ప్రారంభిస్తారని, అనంతరం బహిరంగ సభ ఉంటుందన్నారు. సభకు పెద్దఎత్తున బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలను దృష్టిలో ఉంచుకొని ఆయనపై అభిమానంతో ప్రజలు భారీగా సమావేశానికి హాజరుకావాలని కోరారు. అన్ని గ్రామాల నుంచి ప్రజలను సభకు తీసుకొచ్చేందుకు ప్రణాళికను సిద్ధం చేయాలని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking