* ఉత్సాహంగా పాల్గొంటున్న క్రీడాకారులు
* అధికారుల సమన్వయం ` పకడ్బందీ ఏర్పాట్లు
* రాష్ట్ర క్రీడా చరిత్రలో ఇదో నూతనాధ్యాయం ` డాక్టర్ ఆంజనేయ గౌడ్
* విజేతలను అభినందించిన సాట్స్ ఛైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్
* నేడు 6 స్టేడియాల్లో ముగింపు వేడుకలు ` విజేతలకు నగదు పురస్కారాలు
హైదరాబాద్ మే 30 );అత్యంత ఘనంగా ప్రారంభమైన ‘సీఎం కప్ ` 2023’ పోటీలతో నగరంలోని స్టేడియాల్లో సందడి నెలకొంది. 18 క్రీడాంశాల్లో నగరంలోని 6 స్టేడియాల్లో జరుగుతున్న ఈ పోటీల్లో ముఖ్యమైన మ్యాచ్‌లు ముగిసాయి. సీఎం కప్ ` 2023 రాష్ట్ర స్థాయి పోటీలో గచ్చిబౌలి జిఎంసి బాలయోగి స్టేడియంలో అథ్లెటిక్స్, అర్చరీ, బ్యాడ్మింటన్, ఫుట్‌బాల్, హాకీ, స్విమ్మింగ్, ఎల్‌బి స్టేడియంలో హ్యాండ్‌బాల్, వెయిట్ లిఫ్టింగ్, బాక్సింగ్, లాన్ టెన్నిస్ ` టేబుల్ టెన్నిస్, కెవిబిఆర్ ఇండోర్ స్టేడియం, యూసఫ్‌గూడా స్టేడియంలో బాస్కెట్‌బాల్, రెజ్లింగ్, సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో కబడ్డీ, జిమ్నాస్టిక్స్, వాలీబాల్, జిఖానా గ్రౌండ్స్‌లో ఖో`ఖో, గచ్చిబౌలి షూటింగ్ రేంజ్‌లో షూటింగ్ పోటీలు, 33 క్రీడా జట్ల మధ్య పోటీలు తుది దశకు చేరుకున్నాయి.

జిల్లాల నుండి వచ్చిన గ్రామీణ క్రీడాకారులు ఈ పోటీలో ఉత్సాహంగా పాల్గొని క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించారు. వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో పనిచేసి నిర్వహణలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
పోటీల పరిశీలన ` విజేతలకు అభినందన
సీఎం కప్ పోటీల నిర్వహణతో తెలంగాణలో అద్భుతమైన క్రీడా స్ఫూర్తి వెల్లివిరిస్తోందని, రాష్ట్రంలో నూతన యువ ఛాంపియన్‌లతో ఆవిర్భావానికి దోహదం చేసిందని సాట్స్ ఛైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ అన్నారు. సీఎం కప్ పోటీలో భాగంగా ఈరోజు పలు స్టేడియాలను సందర్శించి, పోటీలను వీక్షించిన క్రీడాకారులకు శుభాకాంక్షలు అందజేశారు. ఈరోజు గచ్చిబౌలి స్టేడియంలో స్విమ్మింగ్, అర్చరీ, అథ్లెటిక్స్, యూసఫ్‌గూడా స్టేడియంలో రెజ్లింగ్, ఎల్‌బి స్టేడియంలో బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో విజేతలను ఆయన అభినందించారు.
దిగ్విజయంగా కొనసాగుతున్న సీఎం కప్ పోటీల నిర్వహణతో తెలంగాణ ఖ్యాతి మరోసారి జాతీయ స్థాయిలో మారుమ్రోగుతోందని, గ్రామీణ క్రీడా రంగ చరిత్రలో నూతనాధ్యయనం మొదలైందని ఆయన పేర్కొన్నారు. గ్రామీణ యువ క్రీడా ప్రతిభకు ప్రోత్సాహం కల్పించే ఈ కార్యక్రమ రూపకల్పన అద్భుతమని క్రీడా రంగ నిష్ణాతులు ప్రశంసిస్తున్నారని ఆయన అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సహకారంతో మరిన్ని క్రీడా కార్యక్రమాల రూపకల్పన చేస్తామని, సాట్స్ ఛైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ తెలిపారు.
నగదు పురస్కారాలు
ఈ పోటీల్లో విజేతలకు తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ నగదు పురస్కారాలు అందజేస్తుంది. టీం ఈవెంట్లలో మొదటి స్థానానికి లక్ష రూపాయలు, రెండో బహుమతి 75 వేలు, మూడో స్థానం పొందిన వారికి 50 వేల నగదు పురస్కారాలు అందజేస్తుండగా, వ్యక్తిగత క్రీడాంశాల్లో గోల్డ్ మెడల్ విజేతకు 20 వేలు, సిల్వర్ మెడల్ విజేతకు 15 వేలు, బ్రాంజ్ మెడల్ విజేతలకు 10 వేల రూపాయల నగదు బహుమతులు అందజేస్తున్నారు. క్రీడల్లో పాల్గొన్న క్రీడాకారులందరికి సర్టిఫికేట్లు ప్రధానం చేయనున్నారు.

6 స్టేడియాల్లో ముగింపు వేడుకలు
18 క్రీడాంశాల్లో సాగిన ఈ పోటీలు (31వ తేది మే, 2023) 6 స్టేడియాల్లో ముగింపు వేడుకలు నిర్వహించనున్నారు. ఎల్‌బి స్టేడియంలో జరగబోయే ముగింపు వేడుకలకు రాష్ట్ర హోం మంత్రి మహమద్ అలీ, జిఎంసి బాలయోగి స్టేడియంలోని వేడుకలకు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కెవిబిఆర్ ఇండోర్ స్టేడియంలోని వేడుకలకు పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.
సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, జింఖానా గ్రౌండ్స్‌లో జరిగే ముగింపు వేడుకలకు డిప్యూటి స్పీకర్ పద్మారావ్ గౌడ్, షూటింగ్ రెంజ్‌లో జరిగే వేడుకలకు నగరమేయర్ శ్రీమతి గద్వాల్ విజయలక్ష్మీలు అతిథులుగా హాజరు కానున్నారు.