రిటైర్డ్ కార్మికులకు స్వంత ఇల్లు ఇప్పించేందుకు కృషి చేస్తా

 

-ఐ.ఎన్.టి.యూ.సి క్రమశిక్షణ సంఘం చైర్మన్ కాంపెల్లి సమ్మయ్య

ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ జనవరి 15:

సింగరేణిలో పనిచేస్తూ పదవి విరమణ పొందిన సొంత ఇల్లు లేని కార్మికులకు సొంత ఇంటి పథకం కింద ఇళ్లను ఇప్పించేందుకు కృషి చేస్తానని క్రమశిక్షణ సంఘం చైర్మన్ మరియు ఐఎన్టీయూసీ బెల్లంపల్లి రీజన్ ఉపాధ్యక్షుడు కాంపల్లి సమ్మయ్య హామీ ఇచ్చారు. మంగళవారం పదవి విరమణ పొందిన కార్మికులు సమ్మయ్యను కలిసి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపి,వారు. ఎదుర్కొంటున్న సమస్యలను ఆయనకు వివరించారు. సొంత ఇల్లు లేక కంపెనీ ఇచ్చిన ఇంటిని కాళీ చేయక గ్రాడ్యుయేట్ తీసుకోక ఎంతో నష్టపోతున్నామని వారు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. 2021-23 మధ్యలో దిగిపోయిన రిటైర్మెంట్ కార్మికులకు 11వ వేతన ఒప్పందం ప్రకారము పెరిగిన పెన్షన్ దాని ఏరియర్స్ చెల్లించక పదవ వేజ్ బోర్డ్ పెన్షన్ మాత్రమే చెల్లించడం దారుణమని అన్నారు. అదేవిధంగా18, మార్చి,2018 వరకు 10 లక్షల గ్రా డ్యూటీ సీలింగ్ ఉండేదని,29, మార్చి,2018 నుంచి 20 లక్షలకు నిర్ణయం తీసుకున్నారని కానీ1, జనవరి,2017 నుంచి 20, ఆగస్టు,2018 వరకు మధ్యలో ఉద్యోగ విరమణ చేసిన కార్మికులకు గ్రాట్యూటీ ఏరియర్స్ లెక్కించి చెల్లించాల్సి ఉండగా ఈ విషయమై కోర్టులో ఇచ్చిన తీర్పులను కూడా అటు ఇండియా యజమాన్యం ఇటు సింగరేణి యాజమాన్యం పట్టించుకోవడంలేదని వారు ఆరోపించారు. నేటి వరకు కూడా ఏరియర్స్ ఇవ్వలేదని ఆరు సంవత్సరాలు గడుస్తున్నా తమను పట్టించుకోవడంలేదని రిటైర్మెంట్ కార్మికులు తెలిపారు. ఇక వైద్య పరంగా సిపిఆర్ఎంఎస్ కార్డు ద్వారా ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం చేసుకుంటే కార్డు నుంచి ఎన్ని రూపాయలు డ్రా అయినాయో ఎన్ని రూపాయలు మిగిలి ఉన్నాయో కార్మికులకు మెడికల్ డిపార్ట్మెంట్ కు ఎప్పటికప్పుడు తెలియజేయాలని, ఆస్పత్రి డిశ్చార్జి సమ్మర్ లో వాటి వివరాలు తెలిపాలని అలా చేయడం లేదన్నారు. ఈ సి పి ఆర్ ఎం ఎస్ హెల్త్ కార్డుల వైద్య పర్మితిని 8 లక్షల నుంచి పది లక్షల పెంచుతున్నట్లు డిప్యూటీ సీఎం ఇచ్చిన హామీని ఇంతవరకు ప్రభుత్వం అమలు చేయలేదని వెంటనే సర్కులర్ ఇప్పించాలని కోరారు. సుదీర్ఘకాలం పనిచేసిన రిటైర్డ్ అయిన కార్మికులు ఏదైనా పని నిమిత్తం గనులపై డిపార్ట్మెంట్ల వద్దకు వెళ్తే కనీసం మర్యాద కూడా ఇవ్వడం లేదని కూర్చోవడానికి ఇబ్బందులు గురి అవుతున్నామని,కావున రెస్ట్ హాల్స్ అక్కడ ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ సమస్యలను అన్నింటిని తాను తప్పకుండా యూనియన్ ద్వారా అలాగే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని కే సమ్మయ్య హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ కార్మికుల సంఘం నాయకులు వాసాల శంకరు వీరన్న రాజన్న సంపత్ కొమరన్న దాసరి ఎల్లారం తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking