చెట్ల తిమ్మాయిపల్లి గ్రామం అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తా.
జనవరి 15 ప్రాజబలం న్యూస్ :-
మెదక్ జిల్లా మాసాయిపేట మండలం పరిధిలోని చెట్ల తిమ్మపల్లి గ్రామంలో సర్పంచ్ కి నామినేషన్ వేయడానికి జర్నలిస్ట్ విజయకుమార్ పూర్తిగా అగ్రస్థానంలో ఉన్నాడు అదేవిధంగా ఇప్పటికే గత 20 సంవత్సరాల నుండి ఎస్సీ మాదిగ కులం నుండి ఇప్పటివరకు సర్పంచ్ గా ఎవరూ లేరు కావున ఈ సందర్భంగా జనరల్ వచ్చినప్పటికీ బీసీ వచ్చినప్పటికీ ఎన్నికల విషయంలో ముందుండి నామినేషన్ వేయడానికి సిద్ధంగా ఉన్నాడని తెలిపారు గత 25 సంవత్సరాల క్రితం ఎస్సీ మాదిగ ఉపసర్పంచ్ చేసిన సందర్భాలు ఉన్నాయి 20 సంవత్సరాల క్రితం
ఎస్ టి ఇప్పటివరకు చేసిన సందర్భాలు ఉన్నాయి అదేవిధంగా 30 సంవత్సరాల నుండి ఎస్సీ మాదిగ నుండి రాజకీయ నాయకులు బయట ప్రపంచంలోకి రాకపోవడం ఎంతవరకు సమంజసం అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా గతంలో అరుంధతి యువజన సంఘం అధ్యక్షునిగా ఐదు సంవత్సరాలు చేశారని తెలిపారు అనంతరం నర్సాపూర్ నియోజకవర్గం ఇన్చార్జిగా ఎమ్మార్పీఎస్ కన్వీనర్ గా మూడు సంవత్సరాలు చేశామని అన్నారు దానితోపాటు ఉమ్మడి మండలం వెల్దుర్తి ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షునిగా ఐదు సంవత్సరాలు చేసిన అనుభవాలు ఉన్నాయని చెప్పారు ఇప్పటికైనా ఎస్సీ మాదిగ నోటిఫికేషన్ రావాలని లేక జనరల్ నోటిఫికేషన్ రావాలని చెట్లా తిమ్మాయిపల్లికి
అభివృద్ధి బాటలో నడవాలంటే జనరల్ నోటిఫికేషన్ లేక ఎస్సీ మాదిగ నోటిఫికేషన్ రావాలని తెలంగాణ బీమ్ ఆర్మీ మెదక్ జిల్లా అధ్యక్షులు సీనియర్ జర్నలిస్ట్ విజయ్ కుమార్ డిమాండ్ చేశారు.
అదేవిధంగా తెలంగాణ బీమ్ ఆర్మీ రాష్ట్ర కమిటీ ఆదేశాలు ఇవ్వడం జరిగిందని ప్రచారంలో నామినేషన్ లో పాల్గొంటారని రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాన్ శీను హామీ తెలిపారు.