అర్హులైన ప్రతి ఒక్కరికి పరిహారం అందజేత జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జనవరి 15 : జాతీయ రహదారుల నిర్మాణంలో భాగంగా మంచిర్యాల-వరంగల్‌- ఖమ్మం- విజయవాడ జాతీయ రహదారి 163 జీ నిర్మాణంలో భూములు కోల్పోయిన అర్హులైన ప్రతి ఒక్కరికి పరిహారం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు.బుధవారం జిల్లా కేంద్రంలోని రాజస్వ మండల అధికారి కార్యాలయంలో జాతీయ రహదారి విస్తరణలో బాధితుల కోల్పోయిన వివరాలను మంచిర్యాల రాజస్వ మండల అధికారి శ్రీనివాస్ రావు తో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ రహదారి 163 జీ 384 కిలోమీటర్ల మేర ఉంటుందని, రహదారి నిర్మాణంలో భూములు కోల్పోయిన వారి జాబితా ప్రకారం బాధితులకు నష్టపరిహారం చెల్లించడం జరిగిందని,ఆర్బిట్రేషన్‌ కొరకు దరఖాస్తు చేసుకున్న వారికి పరిహారం అందించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.మొదటి జాబితాలో పరిహారం అందని అర్హత గల వారు సంబంధిత పత్రాలు, బ్యాంక్‌ పాస్‌ పుస్తకాలతో సంప్రదించినట్లయితే రికార్డులు పరిశీలించి సరిగ్గా ఉన్నట్లు నిర్ధారణ జరిగితే సంబంధిత లబ్దిదారుల నుండి అక్విటెన్సీ తీసుకొని పరిహారం చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని,నిర్ధేశిత ధరల ప్రకారం పరిహారం చెల్లించడం జరుగుతుందని,నష్టపోయిన వారు ఆలస్యం చేయకుండా త్వరగా దరఖాస్తు చేసుకునేలా అవగాహన కల్పించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking