గోషామహల్ ప్రజాబలం : హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని గోషామహల్ అసెంబ్లీ నియోజక వర్గం జాంబాగ్ డివిజన్ ఉస్మాన్‌గంజ్ రిసాలా అబ్దుల్లా ,తోఫ్‌ఖానా బస్తీలు చిన్న వర్షానికే నాలా నుంచి నీరు బయటికి వచ్చి బస్తీలు మునిగిపోతున్నాయి.ఈ తతంగం గత 10 సంవత్సరాలుగా జరుగుతుంది.ఈ బస్తీమునిగి పోవడం వలన స్థానిక వ్యాపారులకు తీవ్ర నష్టం జరుగుతున్నది. స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. కాలేజీ విద్యార్థులు స్కూల్ విద్యార్థులు ఎగ్జామ్ టైంలో ఎగ్జాం కు చేరుకోలేక పోతున్నారు. ప్రజాప్రతినిధులు అధికారుల అనాలోచిత నిర్ణయాల వలన ఈ సమస్యలు ఎదురవుతున్నాయి.స్థానిక నాయకులు ఒక ఒక పార్టీ పై ఒక పార్టీ తిటుకోవడానికే సరిపోతుంది .ప్రజాసమస్యలపై స్థానిక ప్రజలతో కలిసి అధికారులతో చర్చింకుండా ప్రజా ప్రతినిధుల స్థానిక నాయకుల కమీషన్‌ల కొరకు బడ్డెట్ కేటాయించడం వలన గత 10 సంవత్సరాలుగా ఉన్న సమస్య పెరిగిందే తప్ప సమస్య పరిష్కారం కాలేదు.రిసాలా అబ్దుల్లా ,ఉస్మాన్ గంజ్ ,తోఫ్‌ఖానా ప్రజలకు ప్రజాప్రతినిధుల ప్రభుత్వ అధికారుల అనాలోచిత నిర్ణయాల వలన సమస్యలు మరింతగా పెరిగాయి.

గోషామహల్ అసెంబ్లీ నియోజక వర్గంలోని జాంబాగ్ డివిజన్ కు బిజేపీ కార్పోరేటర్‌గా రాఖేష్‌జైస్వాల్ ఎన్నికయ్యారు.కాని ప్రజాసమస్యలకోసం ఎప్పుడు ప్రజలలోనికి రాడు. గోషామహల్ అసెంబ్లీ నియెజకవర్గం ఎమ్మెల్యే రాజాసింగ్ ఎంఐఎం నాయకులను తిట్టడానికే సమయం సరిపోతుంది తప్ప ప్రజాసమస్యలు పట్టించుకోడు అని ప్రజలు అనుకుంటున్నారు. హైదరాబాద్ పార్లమెంట్ సభ్యులు అసదుద్దీన్ ఓవైసీ బీజేపీ నాయకులను తిట్టడం బీజేపీ విధానాలను వ్యతిరేకించడం తప్ప ప్రజాసమస్యలపై దృష్ఠి పెట్టడని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉస్మాన్‌గంజ్ ,రిసాలా అబ్దుల్లా, తోఫ్‌ఖానా ప్రజలకు బీజేపీ ఎంఐఎం ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవడమై శాపంగా మారిందని ప్రజలు అనుకుంటున్నారు. తెలంగాణాలో టీఆర్‌ఎస్ ప్రభుత్వంఉన్న గోషామహల్ అసెంబ్లీ నియోజక వర్గంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వారంలో సగం రోజులు గోషామహల్ నియోజక వర్గంలోనే పర్యటించిన ప్రజా సమస్యలు మాత్రం తీరడం లేదని ప్రజలు అనుకుంటున్నారు. ప్రజాప్రతినిధులు నియోజక వర్గ అభివృద్ది కన్నా తమ అభివృద్ది కోసమే పాదయాత్రలు చేస్తున్నారని అనుకుంటున్నారు. ప్రతి ప్రజా ప్రతినిధి పీఎ ను ఏర్పాటు చేసుకుని అసెంబ్లీ నియోజక వర్గంలో బిల్డీంగ్‌లు ఎక్కడ కడుతున్నారని ఒక లీస్ట్ తయారు చేసి ఆ బిల్డీంగ్ వద్దకు అధికారులను పంపీంచి మాముళ్ళు వసూలు చేయడం తప్ప ప్రజా సమస్యలకోసం పట్టించుకునే పాపాన పోలేదని ప్రజలు అనుకుంటున్నారు. ఇంత జరుగుతున్న పాత బేగంబజార్ పోలీస్ స్టేషన్ ఆనుకుని ఉన్నా నాలా పక్కనే ఒక్క ఇంచ్ జాగా వదలకుండా బహుళ అంతస్తుల భవనం నిర్మిస్తున్న అధికారులకు కానీ ప్రజా ప్రతినిధులకు కానీ కనిపించదు.ఎందుకంటే వాళ్ళకు చేరాల్సిన మాముళ్ళు వాళ్ళకు చేరిపోతాయి కనుక ఇది ఒక ఉదాహరణ మాత్రమే.ఇలాంటివి వందలలో ఉంటాయి.దీనిని ఒక్క దాన్ని మాత్రమే పరిగణలోనికి తీసుకోకూడదు.జాంబాగ్ డివిజన్ ప్రజలకు ఎంఐఎం బీజేపీ ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడం శాపంగా మారింది అని ప్రజలు అనుకుంటున్నారు.