గోషామహల్ ప్రజాబలం ప్రతినిధి:పేద ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న ఉస్మానియా ఆస్పత్రికి వస్తే తనకు దేవాలయానికి వచ్చినట్లు అనిపిస్తుందని, ఇక్కడి వైద్యులు దేవుళ్లుగా, నర్సులు దేవతలుగా కనిపిస్తారని ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ ఎంఎస్ ప్రభాకర్ రావు అన్నారు. శుక్రవారం ఉస్మానియా ఆస్పత్రిలోని ఓపి గేట్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన మంచినీటి ప్లాంటును ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్, అధికారులు డాక్టర్ త్రివేణి, డాక్టర్ శేషాద్రి, డాక్టర్ ఎండీ రఫీ లతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… పాత భవనం మూసి వేయడంలో స్థలం సరిపోక అటు రోగులు, ఇటు వైద్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆస్పత్రి నూతన భవన నిర్మాణం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కు, మంత్రి కేటీఆర్ కు విన్నవిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు ఆహ్మద్ అలీ, ఆనంద్ కుమార్ గౌడ్, మనోహర్ బాబు తదితరులు పాల్గొన్నారు.

