ఖమ్మం ప్రతినిధి అక్టోబర్ 20 (ప్రజాబలం) ఖమ్మం ఎన్నికల ప్రవర్తనా నియమావళి పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. శుక్రవారం నూతన కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాల తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు. జిల్లాలో 16 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటుచేసి క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేపడుతున్నట్లు ఆయన అన్నారు. వేర్ హౌజ్, గోడౌన్లు, కోల్డ్ స్టోరేజీలు, ఫంక్షన్ హాళ్లలో తనిఖీలు చేయాలన్నారు. రోజువారి ఎన్ని వాహనాలు, ఎన్ని వేర్ హౌజ్, గోడౌన్లు, ఫంక్షన్ హాళ్లు తనిఖీ చేసింది నివేదిక సమర్పించాలన్నారు. హోల్ సెల్ షాపుల్లో బల్క్ గా చీరెలు, ఇతరత్రా వస్తువులు కొన్నచోట్ల, ఆయా కొనుగోలుదారుని గుర్తించి, విచారణ చేయాలన్నారు. గ్రామాల్లో ప్రజలను సమీకరించి సి విజిల్ యాప్ పై అవగాహన కల్పించాలన్నారు. స్థానిక పరిస్థితులను బట్టి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు.
ఈ సమావేశంలో శిక్షణ సహాయ కలెక్టర్ మయాంక్ సింగ్, ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ అధికారులు డిఆర్డీఓ విద్యాచందన, సిపిఓ ఏ. శ్రీనివాస్, జిల్లా పశుసంవర్ధక అధికారి వేణుమనోహర్, జిల్లా ఎస్సి సంక్షేమ అధికారి కే. సత్యనారాయణ, జిల్లా పౌరసరఫరాల అధికారిణి శ్రీలత, జీఎం ఇండస్ట్రీస్ అజయ్ కుమార్, జిల్లా మత్స్య శాఖ అధికారి ఆంజనేయ స్వామి, ఏడి మైనింగ్ సంజయ్, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రవిబాబు, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి సునీల్ రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారిణి సుమ, ఇడి ఎస్సి కార్పొరేషన్ నవీన్ బాబు, ఎన్నికల విభాగ సూపరింటెండెంట్ రాంబాబు, రంజిత్, అధికారులు తదితరులు పాల్గొన్నారు