శ్రీ దేవి శరన్నవరాత్రులు సందర్భంగా అన్నదానం కార్యక్రమం

ఖమ్మం ప్రతినిధి అక్టోబర్ 21 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో పలు గ్రామాల్లో శ్రీదేవి నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు జరిగినాయి,ఈ కార్యక్రమాలను ఎమ్మెల్యే సతీమణి కందాళల విజయమ్మ ,కుమార్తె దీప్తిక ,కూసుమంచి ఎమ్మార్వో సతీష్ , తదితరులు ప్రారంభించారు, ఖమ్మం జిల్లా: కూసుమంచి మండలం గ్రామంలో కౌండిన్య దళం గౌడ్ సంఘం ఆధ్వర్యంలో మొదటి వార్షికోత్సవం దేవి శరన్నవరాత్రులు సందర్భంగా ఏర్పాటు చేసిన ఏడవ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అమ్మవారి పూజా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కందాళ ల ఉపేందర్ రెడ్డి సతీమణి విజయమ్మ కుమార్తె దీప్తిక వారి కుటుంబ సభ్యులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదానo కార్యక్రమం ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతిరోజు అమ్మవారికి మూడుసార్లు పూజా హారతి, కళాకారుల తో కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.అని ఎమ్మెల్యే సతీమణి విజయమ్మ కుమార్తె దీప్తి తెలిపారు ,కూసుమంచి లో నివసిస్తున్న సభ్యులందరికీ తమ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని ,విగ్రహ దాత మంద నాగులు వారి కుటుంబ సభ్యులకు వారి తరపున అందరికీ దేవీ నవరాత్రులు మరియు దసరా శుభాకాంక్షలు తెలిపారు. కూసుమంచి ఎమ్మార్వో సతీష్ కూడా దేవునికి కొబ్బరికాయ కొట్టి పూజ చేశా రు. భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు, అన్నదానికి సుమారు1600 మంది భక్తులు హాజరయ్యారు, ఈ కార్యక్రమంలో కూసుమంచి సర్పంచ్ చిన్న మోహన్ ఎంపీపీ శీను మాజీ సర్పంచ్ భారీ వీరభద్రం, ఆశిక్ పాషా సీతా రాములు, బాలకృష్ణ రెడ్డి వేముల వీరయ్య ఎంపీటీసీ ఉపేందర్ , జొన్నలగడ్డ రవి , రామకృష్ణ మంద నాగులు గౌడ్ ,మంద నాగేశ్వరరావు గౌడ్ ( సీఎం ) మంద ప్రసాదు గౌడ్ మంద శేఖర్ మంద రాంబాబు గౌడ్ మంద చిన్న వెంకన్న గౌడ్ విష్ణు గౌడ్ మోహన్ గౌడ్ పెద్ద వెంకన్న అర్వపల్లి సాయి అర్వపల్లి ఉదయ్ గౌడ్ గౌడ్ అర్వపల్లి శీను, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking