రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ హైదరాబాదు సూచన మేరకు ది అడ్వకేట్ సహకార గృహ నిర్మాణ సంఘం లిమిటెడ్ కరీంనగర్ కు జులై 23న పాలక మండలి ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఎన్నికల అధికారి ఏ కరణ్ కుమార్ తెలిపారు. రహస్య బ్యాలెట్ పద్ధతి ద్వారా జరిగే ఈ ఎన్నికల్లో ఎస్ సి/ఎస్ టి క్యాటగిరి లో 01, మహిళ క్యాటగిరి లో 02, ఓపెన్ క్యాటగిరి లో 06 , మొత్తం 09 డైరక్టర్ లకు గాను జరిగే ఎన్నికలకు గాను డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ న్యాయ సేవ సదన్ భవనం, కరీంనగర్ లో ఈ నెల 13, 15, 16 వరకు నామినేషన్లు, 17 న పరిశీలన, 18 నామినేషన్ జాబితా ప్రకటన, డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ న్యాయ సేవ సదన్ భవనం, కరీంనగర్ లో 23 న పోలింగ్, అదే రోజు లెక్కింపు, ఫలితాల ప్రకటన చేస్తామని, ఈ ఎన్నికలలో 341 మంది న్యాయ వాదులు మాత్రమే ఓటు హక్కు కల్గి ఉన్నారని, ఓటు వెయ్యటానికి వచ్చేవారు ఏదైనా గుర్తింపు కార్డు తెచ్చుకోవాలని కోరారు.