పార్కు స్థలంలో అక్రమంగా కట్టిన ఇండ్లను వెంటనే తొలగించాలి.

ప్రజావాణి లో జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు

…చిన్నా ముదిరాజ్
కాంగ్రెస్ పార్టీ జిల్లా జనరల్ సెక్రెటరీ.

సంగారెడ్డి జులై 15 ప్రజ బలం ప్రతినిధి : జిల్లాలోని అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో చక్రపురి కాలనీలో సర్వే నంబర్‌లు126, 127, 128, 129, 130, 135, 136, 137, 152 & 152 హూడ లే అవుట్ పార్కు స్థలంలో అక్రమంగా 4 ఇండ్ల నిర్మాణాలు చేపట్టారన్ని, ఈ అక్రమ నిర్మాణాన్ని వెంటనే ఆపాలని కలెక్టరేటు లో సోమవారం ప్రజావాణిలో జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్న ముదిరాజ్ (బాల మురళీ కృష్ణ) జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, అమీన్పూర్ మున్సిపల్ కార్యాలయంలోని టౌన్‌ప్లానింగ్‌ విభాగానికి ఇదే విషయంపై గతంలో రెండు సార్లు ఫిర్యాదు చేశాం. అక్కడ మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదును పరిష్కరించిన పాపాన పోలేదు. అందువల్ల జిల్లా కలెక్టర్ కు చక్రపురి కాలనీలో జరుగుతున్న అక్రమాలను దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు. ఇట్టి కబ్జాదారులపై వెంటనే చర్యలు జరిపేలా అప్రూవల్ లేఔట్ లోని పార్క్ స్థలాన్ని పరిశీలించి పార్కులోకి చొరబడి కడుతున్న నాలుగు ఇండ్లను కూల్చివేసి అక్రమంగా కట్టడాలు దృష్టికి తెచ్చారన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking