ప్రజావాణి, దరఖాస్తుల పై ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కరించాలి.

కలెక్టరేట్ లో శానిటేషన్, కార్యాలయాల నిర్వహణ బాగుండాలి.

ప్రజావాణిలో 75 ఆర్జీలు

… జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు

సంగారెడ్డి జులై 15 ప్రజ బలం ప్రతినిధి :
ప్రజావాణి, కార్యక్రమంలో వచ్చిన ప్రతి దరఖాస్తును త్వరితగతిన పరిష్కారం చేయాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అధికారులకు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాలకు చెందిన 75 మంది దరఖాస్తు చేసుకున్నారని కలెక్టర్ తెలిపారు.
ప్రజావాణి లో అందిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని తెలిపారు.
కలెక్టరేట్ లో, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా నిర్వహణ చేయాలనీ, కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ప్రజావాణి కార్యక్రమంలో 75 అర్జీలకు గాను, ధరణి, రెవిన్యూ శాఖకు సంబంధించినవి,
పెన్షన్, పంచాయతీ రాజ్, శిశు సంక్షేమ శాఖ, వచ్చాయని కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్, మాధురి, జిల్లా రెవెన్యూ అధికారి పద్మజా రాణి, సంబంధిత జిల్లా అధికారులు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking