అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ కు వినతి
ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ జనవరి 20:
మందమరి మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలోని జయశంకర్ విగ్రహం నుండి మున్సిపల్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం మున్సిపల్ కమిషనర్ నీలిగొండ వెంకటేశ్వర్లు కలిసి వినతిపత్రం అందించారు. అనంతరం మున్సిపల్ ఎన్నికల సాధన అఖిలపక్ష కమిటీ కన్వీనర్ అందుగుల శ్రీనివాస్ మాట్లాడుతూ మందమర్రి మున్సిపాలిటీకి ఎన్నికల లేకపోవడం వల్ల అభివృద్ధి కుంటుపడిందని ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. భద్రాచలం, ఆసిఫాబాద్ మున్సిపాలిటీలలో ఏ విధంగనయితే ఎస్టీ గ్రామాలను గ్రామపంచాయతీలుగా విభజించి ఎన్నికల నిర్వహిస్తున్నారో అదే పద్ధతిలో మందమర్రి ఎస్టీ ప్రాంతాన్ని విభజించి కళ్యాణిఖని మున్సిపాలిటీగా ఏర్పాటుచేసి ఎన్నికల నిర్వహించాలన్నారు. ఎన్నికలు నిర్వహించేంతవరకు అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తూనే ఉంటామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష కమిటీ నాయకులు జె.రవీందర్, బండారి సూరిబాబు, సప్పిడి నరేష్, ముల్కల రాజేంద్రప్రసాద్, రాయబారపు వెంకన్న, జనార్ధన్, మాయ రమేష్ తదితరులు పాల్గొన్నారు.