ఎలక్ట్రిషన్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఎలక్ట్రికల్ దినోత్సవం

 

ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ జనవరి 27:

మందమర్రి ప్రయివేట్ ఎలక్ట్రిషన్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఎలక్ట్రిషన్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సోమవారం పట్టణంలోని ప్రధాన మార్కెట్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో థామస్ అల్వా ఎడిషన్ చిత్రపటానికి నివాళ్లు అర్పించి ఎలక్ట్రిషన్లు జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ నేడు విద్యుత్ దీపకాంతులతో పగలు రేయి అనే బేధం లేకుండా అన్ని పనులనూ సులువుగా చేసుకునేందుకు కారణం థామస్ ఆల్వా ఎడిసన్ విశేష కృషి అని తెలిపారు. థామస్ ఆల్వా ఎడిషన్ బల్బుని కనిపెట్టిన జనవరి 27న ఎలక్ట్రిషన్ దినోత్సవంగా పరిగణిస్తూ ఎలక్ట్రిషన్లు అంతా పండగ లాగా ఘనంగా జరుపుకుంటామని తెలిపారు. ఎలక్ట్రిషన్స్ అందరం ఐకమత్యంతో సంఘం బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎలక్ట్రిషన్లు, ప్లంబర్లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking