ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ జనవరి 27:
మందమర్రి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఆదివారం ప్రెస్ క్లబ్ లో ఘనంగా నిర్వహించారు. ముందుగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గాండ్ల సంజీవ్ పతాక ఆవిష్కరణ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం ఏర్పడి 76 సంవత్సరాలు కావస్తుందని రాజ్యాంగంలోని హక్కుల ద్వారానే మనిషి తను మనుగడ సాగిస్తున్నాడని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలని మనిషి తన హక్కుల కోసం రాజ్యాంగం తెలుసుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కడారి శ్రీధర్, వర్కింగ్ ప్రెసిడెంట్ తేళ్ళ విజయ్ కుమార్, సీనియర్ జర్నలిస్టు ఏం.డి సలాం, వాసు, జాడి ముకుందం, ఉప్పులేటి నరేష్, కుర్రె శ్రీనివాస్, శ్రీరామోజు సంతోష్, రాజ్ కుమార్, మర్రి దేవేందర్, కుమ్మరి రమేష్ తదితరులు పాల్గొన్నారు.