ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 10 : మంచిర్యాల జిల్లా పురగిరి క్షత్రియ పెరుక కుల సంఘం జిల్లా అధ్యక్షుడు బేర సత్యనారాయణ ఆధ్వర్యంలో జిల్లా సమావేశంలో నిర్వహించడం జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న పెరుక సంఘం రాష్ట్ర ఆర్గనైజేషన్ సెక్రెటరీ కీత విజయ్ కుమార్, కరీంనగర్ జిల్లా పెరుక సంఘం అధ్యక్షుడు గాండ్ల చంద్రశేఖర్, సీనియర్ నాయకుడు కర్రె లచ్చన్న,డాక్టర్ బోడ్డు రఘునందన్,మాజీ అధ్యక్షుడు పెట్టం లక్ష్మణ్,మంచిర్యాల పట్టణంలో నిర్వహించడం జరిగింది.బుధవారం ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ…లోక్ సభ ఎన్నికల్లో భాగంగా ఏప్రిల్ 07 తేదీన పద్మనాయక ఫంక్షన్ హాల్ లో జరిగిన సమావేశంలో మా పెరిక కులస్తులు,స్థానిక ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, అధ్యక్షతన జరిగిన సమావేశంలో కొత్త మంది పెరిక కులస్తులు కలిసి కాంగ్రెస్ పార్టీకి మొత్తం మద్దతు ఇవ్వడం అనేది,మా జిల్లా పెరిక కుల సంఘం మద్దతు దాని తెలిపిన పెరిక నాయకులకు,ఇది పద్ధతి కాదని తెలిపారు,అంతేకాకుండా వారు జిల్లా,రాష్ట్ర,నాయకులు కాదని తెలిపారు, జిల్లా పెరుక సంఘం బాడికి కానీ,రాష్ట్ర నాయకులు కానీ,తెలపకుండా వీరు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వడం సరి అయిన పద్ధతి కాదని,దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం అని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు సందెల వెంకటేష్,ముత్యం సత్తీష్,ఆకుల అశోక్,ముత్యం శంకరయ్య, మోటపలుకుల తిరుపతి,చుంచు శ్రీనివాస్,దుమ్మటి అర్జున్, కుంచాల శంకరయ్య, రామచందర్,అంకతి గంగాధర్,శ్రీకాంత్,ఎంబడి రమేష్,పాయల శంకర్, రామచందర్,మధు,తదితరులు పాల్గొన్నారు.