టీఎన్జీవో మెదక్ జిల్లా అధ్యక్షులు దొంత నరేందర్.
మెదక్ ప్రజాబలం న్యూస్ :-
మేదక్ జిల్లాలోని ముస్లిం సోదర సోదరీమణులకు టీఎన్జీవో మెదక్ జిల్లా అధ్యక్షులు దొంత నరేందర్ రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. నెలవంకతో ప్రారంభమైన రంజాన్ మాసంలో ముస్లిం సోదరీ సోదరీమణులు 30 రోజులపాటు అల్లాహ్ ఇచ్చిన శక్తి సామర్థ్యాలతో కఠిన ఉపవాస దీక్షలు చేసిన వారి ఆశయాలు ఆకాంక్షలు నెరవేరే విధంగా ఆ అల్లాహ్ ఆశీర్వదించలని ప్రార్థించారు. మతసామరస్యానికి ప్రతీకగా రంజాన్ పండగ (ఈద్-ఉల్-ఫితర్) కుటుంబ సభ్యులతో ప్రశాంత వాతావరణంలో సుఖశాంతులతో ఆనందంగా ఆహ్లాదంగా జరుపుకోవాలని కోరారు.